Home అంతర్జాతీయ వార్తలు లండన్‌లో ప్రధాని మోడీకి చేదు అనుభవం…

లండన్‌లో ప్రధాని మోడీకి చేదు అనుభవం…

London Rights Groups Protest PM Modi Visit To UK

లండన్: మూడు దేశాల పర్యటనలో భాగంగా బుధవారం లండన్ చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి చేదు అనుభవం ఎదురైంది. కతువా ఏనిమిదేళ్ల బాలిక అత్యాచార ఘటనపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనను నిరసిస్తూ చిన్నారి ఆసిఫా కుటుంబానికి న్యాయం చేయాలంటూ పలు హక్కుల సంఘాలు లండన్ వీధుల్లో ఆందోళనలు చేశాయి. సౌత్ ఏసియా సాలిడారిటీ గ్రూప్ ఆధ్వర్యంలో వాహనాలపై పెద్దపెద్ద ఎల్‌ఇడి స్క్రీన్లను ఏర్పాటు చేసి, వాటిపై మోడీ నాట్ వెల్‌కం, జస్టిస్ ఫర్ ఆసిఫా అంటూ ప్రదర్శించాయి. థేమ్స్ తీరంలోని బ్రిటన్ పార్లమెంట్ ఎదుట, చుట్టుపక్కల వీధుల్లో ఎల్‌ఇడి స్క్రీన్లు ఉన్న వాహనాలను తిప్పారు. ఈ నేపథ్యంలో మోడీ పర్యటించే ప్రాంతాల్లో లండన్ పోలీసులు భద్రత పెంచారు.