Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

ఈ కోటు.. మిమ్మల్ని మాయం చేస్తుంది..!

Invisibility-Cloakలండన్ : ఒక వస్త్రాన్ని ధరించగానే మనిషి మాయం అవడం మనం కొన్ని సినిమాల్లో చూశాం. కానీ ఇప్పుడు అది నిజ జీవితంలో కూడా సాధ్యం. మనిషిని మాయం చేసే వస్త్రంపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. లండన్‌లోని క్వీన్ మేరీ విశ్వవిద్యాలయంలో పరిశోధకులు వస్తువులను మాయం చేసే ఓ పరికరాన్ని రూపొందించారు. ఇది ప్రాక్టికల్‌గా ధరించడానికి వీలయ్యే దుస్తుల్లా రూపొందించడం విశేషం. మొదటగా శాస్త్రవేత్తలు మిశ్రమ పదార్థాలను ఉపయోగించి వస్తువులను మాయం చేయడానికి ప్రయోగాలు చేపట్టారు. ఈ పదార్థాలు వస్తువుల ఉపరితల ధర్మాలను విస్తరించి.. ఆ వస్తువు అక్కడ లేనట్లుగా చూపిస్తుంది. ఈ ప్రయోగమే మాయమయ్యే వస్త్రం తయారీ దిశగా వారిని ముందడుగు వేయించింది. పరివర్తన చెందే ఆప్టిక్స్ ఆధారంగా ఈ డిజైన్‌ను రూపొందించినట్లు పరిశోధకుల్లో ఒకరైన యాంగ్ హూవో తెలిపారు. ఇంజినీరింగ్ అప్లికేషన్లు, ఏరోస్పేస్ పరిశ్రమలకు తమ పరిశోధనలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన చెబుతున్నారు. వీరు చేపట్టిన పరిశోధనలు జర్నల్ సైంటిఫిక్ రిపోర్ట్‌లో ప్రచురితమయ్యాయి.

Comments

comments