Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

పట్టుకుచ్చులాంటి జుట్టు కోసం…

lon-hairచర్మానికే కాదు జుట్టు బాగా పెరగడానికి పోషకాహారం తీసుకోవడం అవసరం. సాధారణ జుట్టు తత్వం ఉన్నవారు చేపలు, మాంసం, పప్పు ధాన్యాలు, మొలకలు తీసుకోవాలి.
జుట్టు ఉన్నవారు పచ్చి కూరగాయలు, ధాన్యాలు, బ్రౌన్ రైస్, అరటిపండ్లు, డ్రైఫ్రూట్స్, విటమిన్ ఇ క్యాప్సూల్స్ తీసుకోవాలి. జిడ్డు తత్వపు జుట్టు ఉన్నవారు ఆకుకూరలు, సలాడ్లు, తాజా పండ్లు, పెరుగు తీసుకోవాలి.
ఆరోగ్యంగా ఉండాలంటే ముందుగా పాటించాల్సిన నియమం, శుభ్రంగా ఉంచుకోవడం.
తక్కువ ఉన్న షాంపూలను ఎంచుకోవాలి. జుట్టులో సహజంగా ఉండే నూనెలు హరించి వేసేలాగా ఉండకూడదు. షాంపూ తలలో చర్మాన్ని శుభ్రం చేసేలా ఉండాలి. జుట్టును కండిషన్ చేయాలి. అతిగా షాంపూచేయడం వల్ల జుట్టు ఎండి పోయినట్టుగా అవుతుంది. గుడ్డు మంచి కండీషనర్. పచ్చసొనలో ఉండే ఫ్యాట్, ప్రొటీన్లు జుట్టుకి తేమ అందిస్తుంది. తెల్ల సొన జుట్టులో ఉన్న అనవసర నూనె లను తొలగిస్తుంది. అందుకే సాధారణ జుట్టు ఉన్నవారు మొత్తం గుడ్డును పెట్టు కోవచ్చు. పచ్చసొనను పొడిజుట్టు వారు, తెల్లసొనను నూనె తత్వపు జుట్టు వారు పెట్టుకోవాలి. గోరువెచ్చని నీటితో కడిగేయాలి.
మీద దురదగా ఉంటే, సరైన పోషకాహారం తీసుకోవట్లేదనో, ఒత్తిడికి గురవుతున్నారనో, వాతావరణం వల్లనో అని అర్థం. రెండు స్పూన్ల నిమ్మరసం, ఆలివ్ నూనె, నీరు కలిపిని మిశ్రమాన్ని మాడుకు మర్ధనా చేసుకుని ఇరవై నిమిషాలు ఉంచి కడిగేయాలి. మాడు మీద ఉన్న చుండ్రును నిమ్మనూనె తొలగిస్తే ఆలివ్ నూనె తగిన తేమను అందిస్తుంది.
అయిన జుట్టుకి తేనె, ఆలివ్ నూనె. ఎండ కిరణాలు జుట్టుకి హాని కలిగిస్తాయి. సగం కప్పు తేనె, రెండు స్పూన్ల ఆలివ్ నూనె మిశ్రమాన్ని తలకి మసాజ్ చేయాలి. ఇరవై నిమిషాల తర్వాత కడిగేయాలి. ఆలివ్ నూనె కండిషన్ చేస్తే తేనె యాంటీ బ్యాక్టీరియల్‌గా, కండిషనర్‌గా పనిచేస్తుంది.
పద్ధతుల్లో జుట్టుకి రంగు వేసుకోవచ్చు. సహజమైన గోరింటాకుకు రంగునిచ్చే గుణం ఉంటుంది. మొక్కల నుంచి తీసిన ఇండిగో అనే సహజరం గునిచ్చే పదార్థానికి కలిపితే రంగు మరింత మెరుగ్గా పడుతుంది. ముందు రాత్రి గోరింటాకును, ఇండిగోను కలిపి ఉంచాలి.
బ్రౌన్ కలర్ జుట్టు కోసంః నీలిమందును గోరువెచ్చని నీటిలో కలిపి ఉంచి పదిహేను నిమిషాలు వదిలేయాలి. తర్వాత గోరింటాకు పేస్ట్‌ను, ఇండిగో పేస్ట్‌ను కలిపి తలకు పట్టించి ఒక గంటసేపు షవర్ క్యాప్ పెట్టుకొని వదిలేయాలి. తర్వాత బాగా కడిగి షాంపూ చేయాలి.
జుట్టు కోసంః నీలిమందును గోరువెచ్చని నీటిలో నానబెట్టి పదిహేను నిమిషాలు ఉంచాలి. ముందుగా గోరింటాకును తలకు పట్టించి ఇరవై ఐదు నిమిషాలు ఉంచి కడిగేయాలి. తర్వాత ఇండిగో పేస్ట్‌కు సాల్ట్ కలిపి జుట్టుకు పట్టించాలి. ఒక రెండు గంటల పాటు షవర్ క్యాప్ పెట్టుకుని ఉంచాలి. తర్వాత కడిగేయాలి.

Comments

comments