Search
Thursday 15 November 2018
  • :
  • :

పొట్లకాయ కాదు… దోసకాయ

Dosakaya

లండన్: నమ్మశక్యంకాని అత్యంత పొడవైన దోసకాయను ఇంగ్లాండ్‌లో భారతీయ సంతతికి చెందిన వ్యక్తి పండించారు. దాని పొడవు 129.54 సెమీ.(51 అంగుళాలు. 1991లో ఇంగ్లాండ్‌కు వెళ్లక ముందు రఘ్‌బీర్ సింగ్ సంఘేరా భారత్‌లో రైతుగా పనిచేశారు. ఇంగ్లాండ్‌కు వచ్చాక ఆయన తన పెరటి తోటలో ఈ అత్యంత పొడవైన దోసకాయను పండించారు. అది అంత పొడవుగా పెరగడానికి రోజూ ప్రార్థనలు చేయడమే కారణమని ఆయన అన్నారు. ప్రపంచంలోనే అత్యతం పొడవైన ఈ దోసకాయ గురించి బ్రిటన్ మీడియా రాసింది. గిన్నీస్ రికార్డు ప్రకా రం ఇప్పటి వరకు ఉన్న అత్యంత పొడవైన దోసకాయ 107 సెమీ.(42.13అంగుళాలు). దీనిని 2011లో వేల్స్ లో పండించారు.

కానీ తాజాగా ఇప్పుడు రఘ్‌బీర్ సింగ్ సంఘేరా పండించిన దోసకాయ దానికన్నా పొడవైనదిగా రికార్డులోకి ఎక్కిందని బిబిసి తెలిపింది. దోస తీగను రోజూ చూసేందుకు నేను దాని ప్రక్కన కూర్చునే వాడిని. ప్రార్థనలు చేసేవాడిని. అది ఆరోగ్యంగా ఎదిగింది. నేనే కాక దాన్ని చూసిన అందరూ ఎంతగానో సంతోషించారు’ అని రఘబీర్ సింగ్ సంఘ్రా తెలిపారు. ‘గత ఏడాది నేను 39 అంగుళాల దోసకాయలు పెంచా ను. ఈసారి కూడా అదే రకం విత్తనాలతో పండించాను. కానీ ఈ ఏడాది మరింత ఏపుగా ఎదిగేందుకు కృషి చేశాను’ అని ఆయన ఐటివి ఛానెల్‌కు చెప్పారు.

‘నేను జీవితాంతం కూరగాయలు పండిస్తున్నాను. కానీ నా జీవితం ఇలాంటి ఘట్టం ఎదురవ్వలేదు. వేడి వాతావరణమే అత్యంత పొడవైన దోసకాయ పండడానికి కారణమై ఉంటుందని నేను భావిస్తున్నాను’ అని కూడా ఆయ న చెప్పారు. ఈ పొడవైన దోసకాయ పూర్తిగా పెరగడం ఆపేశాక గిన్నిస్ రికార్డుకు దరఖాస్తు చేయనున్నట్లు  తెలిపారు. సంఘేరా తన భార్య సరబ్జిత్‌తో డెర్బీలోని నార్మంటన్‌లో నివసిస్తున్నారు. ఆయనకు ఇద్దరు సంతా నం. ఈ పొడవైన దోసకాయను చూడ్డానికి తన పిల్లలు, మనుమలు వస్తుంటారని,  వారు దాన్ని చూసి గర్వపడుతుంటారని, ఆ దోసకాయ పాదు కూడా తనకు మరో బిడ్డ వంటిదేనని ఆయన చెప్పినట్లు డెరీ టెలిగ్రాఫ్ పత్రిక పేర్కొంది.

Comments

comments