Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

గ్రామాల్లో సందడి

Look forward to reservation

రిజర్వేషన్ కోసం ఎదురు చూపు
బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్న స్థానిక నేతలు
మారుతున్న సమీకరణలు

జూలై మాసంలో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయన్న సమాచారంతో గ్రామాల్లో సందడి మొదలైంది. ఓట్ల చేర్పింపు, సవరణలు, బిసి గణన మొదలైన వాటిపై దృష్టి సారించిన స్థానిక నేతలు ఇప్పుడు రిజర్వేషన్ల కోసం ఎదురు చూస్తున్నారు. మండల కార్యాలయాల చుట్టూ తిరుగుతూ రిజర్వేషన్ల కోసం ఆరా తీస్తున్నారు. ఏ రిజర్వేషన్‌కు సర్పంచ్ వచ్చిన అందుకు అనుగుణంగా ఆ వర్గాల నుంచి అభ్యర్థులను రంగంలోకి దించేందుకు సమర్థులను ఎంపిక చేసే పనిలో మండల రాజకీయ నేతలు ఉన్నారు. 

మన తెలంగాణ/ఖమ్మం: గ్రామ పంచాయతీల పదవీ కాలం ఆగస్టు నాటికి ముగియనుండడం అంతకు ముందే ఎన్నికలు జరుపుతామని అధికారులు ప్రకటించడంతో గ్రామాల్లో సందడి మొదలైంది. ఇప్పటికే ఓటర్ల జాబితా తయారీ,  బిసి గణన పూర్తి కావడం, పోలింగ్ కేంద్రాల పరిశీలన, సిబ్బంది, బ్యాలెట్ బాక్సుల తదితర ఏర్పాట్లను పూర్తి చేసి ఎన్నికలకు సమయాత్తమయ్యారు. ఇక మిగిలింది. రిజర్వేషన్ ప్రకటించడం ఒక్కటే. తెలంగాణ రాష్ట్రంలో నూతన పంచాయతీ చట్టం అమలులోకి రావడంతో రిజర్వేషన్లపై కొంత గందరగోళం నెలకొంది. ఇప్పటి వరకు రోటేషన్ పద్దతి అమలులో ఉండేది. గతానికి సంబంధం లేకుండా ఇప్పుడు రిజర్డు పంచాయతీలను ఎంపిక చేయాలని ఇదే రిజర్వేషన్‌ను పదేళ్ల పాటు కొనసాగించాలని చట్టంలో పేర్కొనడంతో ఇప్పటి రిజర్డు స్థానాలు వచ్చే ఎన్నికల్లో కూడా కొనసాగనున్నాయి. అయితే రిజర్వేషన్‌కు ఏ ప్రాతిపాదికన తీసుకున్నారనే దానిపై ఇంకా గందరగోళం ఉంది. గతంలో ఎస్సి, ఎస్టిలకు సంబంధించి జనాభా ప్రతిపాదికన రిజర్డు స్థానాలను ఎంపిక చేయనున్నారు. మొత్తం మండల జనాభాలో ఎస్సి జనాభా ఆధారంగా పంచాయతీలను కేటాయించనున్నారు. అత్యథిక ఎస్సి జనా భా నుంచి ఆవరోహణ క్రమంలో మొదటి స్థా నాలను ఎస్సిలకు కేటాయిస్తారు. ఇక బిసిలకు సం బంధించి మాత్రం కేవలం ఓటర్లను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. రాష్ట్రం యూనిట్‌గా బిసి ఓటర్లను జిల్లా, మండల స్థాయి బిసి ఓటర్లను పరిగణలోకి తీసుకుని బిసి కోటాను ఎంపిక చేయనున్నారు. మొత్తం రిజర్వేషన్‌లో మహిళలకు సగం స్థానాలు కేటాయించనున్నారు. గతేడాది బిసిలకు సుమారు 34శాతం పంచాయతీలను రిజర్డు చేశారని సమాచారం. ఇక ఏజెన్సీ ప్రాంతంలో మొత్తం పంచాయతీలు ఎస్టిలకే రిజర్డు చేస్తారు. ఇందులో సగం మహిళలకు కేటాయించనున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో కొన్ని పంచాయతీలు ఎస్టిలకు రిజర్వు కాగా అక్కడ ఎస్టి జనాభా లేకపోవడంతో ఆ సర్పంచు స్థానాలు ఖాళీగా ఉంటున్నాయి. రిజర్వేషన్ల వ్యవహారం ఒక్క కొలిక్కి వస్తే గ్రామాల్లో రాజకీయం మరింత వేడేక్కనుంది. అర్థబలం, అంగ బలం ఉన్న వారినే బరిలోకి దించేందుకు రాజకీయ పార్టీలు పావులు కదుపుతున్నాయి.

Comments

comments