Home తాజా వార్తలు శిశువు అపహారణకు యత్నం

శిశువు అపహారణకు యత్నం

baby-kidnapమహబూబ్‌నగర్: ఆసుపత్రి వైద్యుల నిర్లక్షం కారణంగా శిశువు అపహరణకు గురౌతుండేది. ఈ సంఘటన పట్టణంలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే గట్టు మండలం ఆలూరు గ్రామానికి చెందిన పవిత్ర ప్రసవం కోసం శనివారం మధ్యాహ్నం గద్వాల ఏరియా ఆసుపత్రిలో చేరింది. సాయంత్రం పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అయితే ఆ తల్లి జన్మనిచ్చిన చిట్టి తల్లిని చూడకముందే శిశువు అపహరణకు యత్నం జరిగింది. శనివారం అర్ధరాత్రి ఒక దుండగుడు ఆసుపత్రి ఆవరణలో కాన్పువార్డు కిటికి అద్దాలు పగిలిపోయి ఉండడంతో ఆసుపత్రిలోకి ప్రవేశించాడు. కుటుంబ సభ్యులు గాఢనిద్రలో ఉండగా, శిశువును దుండగుడు తీసుకుని వెళ్తుండగా చిన్నారి అమ్మమ్మకు మెలకువ వచ్చింది. దుండగుడు పాపని తీసుకుని వెళ్తుండడాన్ని గమనించి పెద్ద పెట్టున కేకలు పెట్టింది. ఆసుపత్రిలో ఉన్న ఇతర రోగుల బంధువులు పట్టుకున్నారు. అనంతరం దేహశుద్ధి చేసి ఆసుపత్రి సిబ్బందికి అప్పగించారు. అయితే ఆసుపత్రి అధికారుల నిర్లక్షం కారణంగా రాత్రి సమయంలో వాచ్‌మెన్, సిబ్బంది సక్రమంగా విధులు నిర్వహించడం లేదని రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా ఆసుపత్రికి తలుపులు, కిటికీలు లేకపోవడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.