Home ఆఫ్ బీట్ వీడియోలు మాంసం ప్రకటనలో వినాయకుడు…

మాంసం ప్రకటనలో వినాయకుడు…

Ganesh

దేశవ్యాప్తంగా ప్రజలు వినాయక నిమజ్జన వేడుకల్లో ఉన్న సమయంలో ఆస్ట్రేలియాకు చెందిన ఒక యాడ్ ఏజెన్సీ గణపతికి అవమానకరరీతిలో ఒక ప్రకటనను రూపొందించింది. ఆస్ట్రేలియాకు చెందిన మీట్ అండ్ లైవ్ స్టాక్ ఆస్ట్రేలియా(ఎంఎల్ఎ) అనే కంపెనీ ఈ నెల 4న వి లవ్ అవర్ లాంబ్ అనే పేరిట ఒక ప్రకటనను విడుదల చేసింది. అయితే ఈ యాడ్ లో వినాయకుడితో పాటు జీసస్, బుద్ధ, గ్రీకు దేవతలు, థార్ తదితరులు కలిసి ఒకే టేబుల్ పై భోజనం చేస్తున్నట్లు చిత్రీకరించారు. వారందరూ కలిసి లాంబ్ మీట్(గొర్రె మాంసం) తింటూ దాన్ని గురించి మాట్లాడటం మనం గమనించవచ్చు. చివరకు ‘ది మీట్ వి కెన్ ఆల్ ఈట్’ అంటూ యాడ్ ను ముగించారు. ఈ యాడ్ వివాదాస్పంగా మారింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది.

https://youtu.be/f8kuoFGgj8s