Home వార్తలు ఓం మహాగణాధిపతయే నమః

ఓం మహాగణాధిపతయే నమః

ganesha4పండుగ అందరూ ఆనందించే వేడుక. కుటుంబసభ్యులతో వినోదంతో గడిపేరోజు. హిందూ పండుగలలో ఒక్కో పండుగకు ఒక్కో విశేషం వుంది. ఏటా భాద్రపద శుద్ధ చవితినాడు వచ్చే వినాయకచవితి మనందరి పండుగ.
హిందూ సాంప్రదాయం ప్రకారం వినాయకుడు సకల దేవతా గణానికి అధిపతి (గణనాయకుడు), అన్ని పూజలకు ప్రప్రథమంగా పూజింపవలసినవాడు. అందుకే ప్రతి శుభకార్యానికి, పూజకు మొదటిగా మనం గణపతి పూజతోనే ప్రారంభిస్తాం. అది పిల్లవా డి బారసాల, విద్యాభ్యాసం నుండి, వివాహం, శంకుస్థాపన, గృహప్రవేశం, వ్యాపార ప్రారంభోత్సవాలు, నూతన వాహనం కొనుగోలు ఇలా ఒక సందర్భం ఏమిటి మానవ జీవితంలో ప్రతి ప్రధానమైన శుభకార్యానికి మొదటిగా గణపతిని పూజించటం అనాదిగా వస్తున్న సాంప్రదాయం.
ఇలా మన ప్రతి పని విజయానికీ, చదువుకు, జ్ఞానానికీ దిక్కైన దేవుడు మన వినాయకుడు. ముందుగా వినాయకుడిని సంతోష పెడితే ఆటంకాలు రాకుండా, కష్టాలు దూరమై, సకల కార్యాలు పొంది, ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని ప్రజల విశ్వాసం. భాద్రపదశుద్ధ చవితినాడు వినాయకుడు జన్మించినది. అన్ని విఘ్నాలపై ఆధిపత్యం జరిగినట్లుగా పురాణాలబట్టి పండితులు తెలుపుతున్న ందున మన దేశంతోపాటు ఇతర దేశాలలోని వారు కూడా ప్రతి సంవత్సరము భాద్రపదశుద్ధ చవితినాడు, బంగారం, వెండి మట్టితో తయారుచేసిన ప్రతిమలకు కుటుంబసభ్యులు అందరూ పూజించటం వల్ల మంచి ఫలితాలు అందుతాయని పురాణకథలు తెలుపుచున్నాయి.
Lord_Ganesha1చవితిరోజున వినాయకుడి దగ్గర పండ్లు, పూలు, పత్రి అని పిలుచుకునే రకరకాల మొక్కల ఆకులు, పిండివంటలను వుంచి భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఆ దేవదేవుని గుణగణాలను కీర్తిస్తాం. మనం మొదలుపెట్టే ప్రతిపనిలో ఎటువంటి విఘ్నాలు లేకుండా విజయం చేకూర్చాలని, జ్ఞానసిద్ధికోసం ప్రార్థిస్తాం.
మట్టితో చేసిన గణపతి విగ్రహాన్ని పూజించడం వలన కరువు కాటకాలు రాకుండా పంటలు సమృద్ధిగా పండుతాయని ప్రతీతి. వ్యవసాయ అభి వృద్ధి కలుగుతుంది. బంగారు గణపతి ప్రతిమ ఐశ్వర్యాభివృద్ధిని, వెండి ప్రతిమ ఆయురారోగ్యాన్నీ, రాగి ప్రతిమ సంకల్పసిద్ధిని, శిలా ప్రతిమ మోక్ష, జ్ఞానాలను అనుగ్రహిస్తాయని పురాణాలు చెబుతున్నాయి.
(శ్రీ విఘ్నేశ్వరుని పూజకు ముందుగా సమకూర్చుకోవలసినవి)
ప్రతి ఏడాది వచ్చే వినాయకచవితి పర్వదిన శుభసందర్భంగా ప్రతి గృహంలోను, సంస్థల్లోనూ ప్రత్యేకంగా పూజాది కార్యక్రమా లు చేయడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఈ పూజలో ఉప యోగించే పూజాద్రవ్యాలతో పాటుగా, స్వామివారిని పూజించే పత్రిది కూడా ప్రథమస్థానం. అందువల్ల ఈ పూజకు సమకూర్చు కోవలసిన అన్ని రకాల పూజాద్రవ్యాలు, పత్రి తదితరాలన్నీ మీకో సారి జ్ఞప్తికి తీసుకురావాలని ఈ క్రింద ఇస్తున్నాం. ఇవి నూతన గృహస్థులకు మరింత ఉపయోగపడగలవని ఆశిస్తున్నాం.
పూజా ద్రవ్యములు : వినాయక ప్రతిమ, పత్రి, పసుపు, కుంకుమ, అగరువత్తులు, హారతి కర్పూరం, గంధం, సాంబ్రాణి, అక్షతలు, బియ్యం, ఆవునేయి లేదా నువ్వుల నూనె, పంచా మృతాలు (ఆవుపాలు, పెరుగు, నేయి, తేనె, పంచదార), తమల పాకులు, పోకచెక్కలు, పువ్వులు, పూమాల, పళ్ళు, కొబ్బరి కాయలు, కలశము, నైవేద్య పదార్థములు, సుగంధ ద్రవ్యములు.
పూజా వస్తువులు : దీపం కుందులు, వత్తులు, అగ్గిపెట్టె, వస్త్రం, యజ్ఞోపవీతం, పంచపాత్ర, ఉద్ధరిణి, కలశంమీద నూతన వస్త్రము, పూజాస్థలంలో పీఠంపై వేయడానికి తగిన పరిమాణంలో తెల్లని వస్త్రం/తువ్వాలు, పళ్ళెం, పాలవెల్లి, ప్రత్తిచే చేయబడు వస్తమ్రులు, మామిడి తోరణాలు, దేవునికి తగిన పీఠము.
lord-ganesh2నైవేద్యం : ఉండ్రాళ్లు-21, కుడుములు, వడపప్పు, పానకం, అటుకులు, కొబ్బరిముక్కలు, బెల్లం, అరటిపళ్ళు, పిండివంటలు మొదలగునవి.
పూజాపత్రి : గరిక, మాచి, బలురక్కసి లేక ములగ, మారేడు, ఉమ్మెత్త, రేగు, ఉత్తరేణి, తులసి, మామిడి, గన్నేరు, విష్ణుక్రాంతం, దానిమ్మ, దేవదారు, మరువం, వావిలాకు, జాజి, దేవకాంచనం, జమ్మి, రావి, తెల్లమద్దె, జిల్లేడు మొదలగునవి తమకు లభ్యమగు పత్రిని సంపాదించి ఆయా మంత్రములతో స్వామి వారిని భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఒకవేళ పత్రిలో లోపము కల్గినను భక్తిలో మాత్రం లోపం ఉండరాదు. పత్రి సకాలములో లభ్యముకానిచో పువ్వులు, అక్షింతలతో పూజించి నమస్కరించాలి.
పాలవెల్లి పూజ : శ్రీ విఘ్నేశ్వరస్వామి వారి పీఠమునకు పైభాగమున పాలవెల్లిని కట్టాలి, పాలవెల్లిని పసుపు కుంకుమల తోను, పూజాపత్రితో తమకు తోచినవిధంగా శోభాయమానంగా అలంకరించుకోవచ్చు. దీనినే మనము సాధారణంగా పాలవెల్లి పూజ అంటాము.
పూజా మందిరములో: విఘ్నేశ్వరస్వామి పూజకు ఉపక్రమించే ముందు తమ ఇంటిలో చదువుకునే పిల్లలు ఉన్నట్లయితే స్వామి ప్రతి మతో పాటు సరస్వతీదేవి పటమును మరియు వారి పాఠ్య పుస్తకాలు, పెన్ను, పెన్సిల్. అలాగే గృహస్థు (యజమాని) వ్యాపారి అయితే శ్రీలక్ష్మీ అమ్మవారి పటమును, వ్యాపార లెక్కల పుస్తకాలు, సంబంధిత వస్తువులు ఇలా ఏ వ్యాపకం వున్నవారు వారి ప్రధానమైన వస్తువులతోపాటుగా వారి ఇష్టదైవం పటమును పెట్టి పూజించడం శుభఫలదాయకం.
గణేశుని పూజ
పూజకు ఏర్పాట్లు : ముందుగా పీట మీద ముగ్గువేసి, బియ్యం వేసి, దానిమీద శ్రీ విఘ్నేశ్వరస్వామి వారి ప్రతిమను ఉంచి పైభా గమున పసుపుకుంకుమతో అలంకరించిన పాలవెల్లిని కట్టాలి. పసుపు వినాయకుణ్ణి చేయాలి. పూజ చేసేవాళ్ళు బొట్టు పెట్టుకుని దీపారాధనచేసి వినాయకునికి నమస్కరించి పూజ ప్రారంభిం చాలి. ముందుగా పసుపుతో చేసిన గణపతిని పూజించాలి.
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః
దీపారాధన : (ఈ క్రింది శ్లోకాన్ని చదువుతూ దీపాన్ని వెలిగించి, దీపం కుందివద్ద అక్షతలు ఉంచి నమస్కరించాలి.)
శ్లో॥ భోదీపదేవి రూపస్త్యం, కర్మసాక్షి హ్యామిఘ్నకృత్
యావత్పూజాం కరిష్యామి తావత్వం సిద్ధిదో భవ ॥
దీపారాధన ముహూర్తస్తు సుముహూర్తోస్తు ॥
పరిశుద్ధి : (పంచపాత్రలోని నీటిని చెంచాతో తీసుకుని కుడిచేతి బ్రొటనవేలు, మధ్య ఉంగరపు వేళ్ళతో నీటిని ఈ క్రింది మంత్రం చెబుతూ తలపై చల్లుకోవాలి)
అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా!
యస్మరేత్ పుండరీకాక్షం సుబాహ్యాంతరశ్శుచిః
పుండరీకాక్ష, పుండరీకాక్ష, పుండరీకాక్షాయ నమః
శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు శ్రీ గణేశాయ నమః
శ్లో॥ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాన్తయే ॥
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
అనేక దన్తం భక్తానాం యేకదన్త ముపాస్మహే ॥
శ్రీ గణేశ షోడశ నామ ప్రతిపాదక శ్లోకాః
శ్లో॥ సుముఖశ్రీ్చకదన్తశ్చ కపిలో గజకర్ణకః
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః
ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః
వక్రతుండః శూర్పకర్ణో హేరమ్బస్కన్దపూర్వజః
షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపిః
విద్యారమ్భే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా,
సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తన్య నజాయతే ॥
ఆచమనం:
ఓం కేశవాయ స్వాహా
నారాయణాయ స్వాహా
మాధవాయ స్వాహా
(అని 3 సార్లు తీర్థం పుచ్చుకోవాలి)
గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః
త్రివిక్రమాయ నమః వామనాయ నమః
శ్రీధరాయ నమః హృషీకేశాయ నమః
పద్మనాభాయ నమః దామోదరాయ నమః
సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః
ప్రద్యుమ్నాయ నమః అనిరుద్ధాయ నమః
పురుషోత్తమాయ నమః అధోక్షజాయ నమః
నారసింహాయ నమః అచ్యుతాయ నమః
జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః
హరయే నమః శ్రీ కృష్ణాయ నమః
(రెండు అక్షింతలు వాసన చూసి వెనుకకు వేయవలెను)
శ్లో॥ ఉత్తిష్ఠంతు భూత పిశాచాః! యేతే భూమి భారకాః
ఏతేషామవిరోధేన! బ్రహ్మకర్మ సమారభే!
(ముక్కుపట్టుకుని ఈ క్రింది మంత్రం చెప్పవలెను)
ప్రాణాయామము:
ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః
ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వ రేణ్యం భర్గోదేవస్య
ధీమహి ధియోయోనః ప్రచోదయాత్ ॥ ఓమాపో జ్యోతీ
రసోమృతం బ్రహ్మభూర్భువస్సువరోమ్ ॥
vinayaka1సంకల్పము : మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణో రాజ్ఞేయా ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయవ్య ప్రదేశే కృష్ణా – గోదావరి మధ్యదేశే స్వగృహే (సొంత ఇల్లు కానివారు మమవసతిగృహే అని చెప్పుకోవాలి) సమస్త దేవతాబ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ దుర్ముఖి నామ సంవత్సరే దక్షిణాయనే వర్ష బుతౌ భాద్రపద మాసే శుక్లపక్షే చతుర్థి తిథౌ ఇందువాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణే ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ, శ్రీమాన్ గోత్రః…………. (మీ గోత్రం చెప్పవలెను) నామధేయః …………… (ఇంటిపెద్ద/యజమాని తన పేరు చెప్పుకోవలెను) ధర్మపత్నీ సమేతస్య మమ సకుటుంబస్య క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం, ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం, సకల ధనకనక విద్యా ప్రాప్త్యర్థం, వస్తువాహన సమృద్ధ్యర్థం సర్వాభీష్ట ఫల సిద్థ్యర్థం, పుత్రపౌత్రాభివృద్థ్యర్థం, శ్రీ వరసిద్ధివినాయక దేవతా ముద్దిశ్య శ్రీ వరసిద్ధివినాయక దేవతా ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ యావచ్ఛక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే॥
(కుడిచేతి ఉంగరపు వేలిని నీటిలో ముంచితీయవలెను)
తదంగ కలశపూజాం కరిష్యేః
(మరలా కుడిచేతి ఉంగరపు వేలిని నీటిలో ముంచితీయవలెను)
కలశపూజ:
(కలశాన్ని గంధం, పుష్పములు, అక్షతలతో పూజించి కలశముపై కుడిచేతిని ఉంచి, క్రింది శ్లోకము చెప్పుకొనవలెను)
శ్లో॥ కలశస్య ముఖే విష్ణుః కంఠేరుద్ర సమాశ్రీతః
మూలేతత్రస్థితో బ్రహ్మా మధ్యే మాతృగణా స్మృతాః
కుక్షౌతు సాగరాః సర్వేసప్తద్వీపా వసుంధరా!
ఋగ్వేదోధయజుర్వేదస్సామవేదో హ్యధర్వణః
అంగైశ్చసహితాస్సర్వే కలశాంబు సమాశ్రీతాః
గంగేచ యమునే కృష్ణే గోదావరి సరస్వతి!
నర్మదే సింధు కావేరి జలేస్మిం సన్నిధింకురు ॥
అయాంతు శ్రీ గణపతి పూజార్థం దురితక్షయ కారకాః
కలశోదకేన పూజా ద్రవ్యాణిచ సంప్రోక్ష్యః దేవమాత్మానంచ సంప్రోక్ష్యః
(పసుపుతో చేసిన గణపతిని తమలపాకుపై ఉంచి కుంకుమతో
బొట్టుపెట్టవలెను. పసుపు విఘ్నేశ్వరుని క్రింది విధంగా పూజించాలి)
శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి ధ్యానం సమర్ప యామి (నమస్కరించవలెను)
గణానాంత్వా గణపతిగ్‌ం హవామహే కవిం కవీనా
ముపమశ్రవస్తవం జ్యేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణాస్పత
ఆనసృణ్వన్నూతిభిస్సీదసాదనం
ఆవాహయామి ఆవాహనం సమర్పయామి (నీటిని చల్లవలెను)
పాదయోః పాద్యం సమర్పయామి (మరల నీటిని చల్లవలెను)
హస్తయోః అర్ఘ్యం సమర్పయామి !! (మరల నీటిని చల్లవలెను)
ముఖే ఆచమనీయం సమర్పయామి !!
(మరల నీటిని చల్లవలెను)
ఔపచారిక స్నానం సమర్పయామి (నీటిని చల్లవలెను)
స్నానానంతర ఆచమనీయం సమర్పయామి (నీటిని చల్లవలెను)
వస్త్రం సమర్పయామి (పత్తితో చేసిన వస్త్రం లేదా పుష్పం ఉంచాలి)
గంధాన్ ధారయామి (గంధమును చల్లవలెను)
కుంకుమం సమర్పయామి !!
గంధస్యోపరి అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి
(అక్షతలు చల్లవలెను)
పుష్పాని సమర్పయామి (పూలతో స్వామివారిని అలంకరించవలెను)
స్వామికి పుష్పాలతో పూజ:
(ఈ క్రింది నామాలు చదువుతూ పుష్పాలతో పూజ చేయవలెను)
ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః
ఓం కపిలాయ నమః ఓం గజకర్ణకాయ నమః
ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః
ఓం విఘ్నరాజాయ నమః ఓం గణాధిపాయనమః
ఓం ధూమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః
ఓం ఫాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః
ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః
ఓం హేరంబాయ నమః ఓం స్కంద పూర్వజాయ నమః
ఓం మహాగణాధిపతయే నమః
నానావిధ పరిమళ పత్రపుష్పాణి సమర్పయామి
(పుష్పాలతోను, పత్రితోనూ పూజించవలెను)
ధూపం ఆఘ్రాపయామి (అగరువత్తిని వెలిగించవలెను)
దీపం దర్శయామి (దీపమును చూపవలెను)
నైవేద్యం సమర్పయామి (బెల్లం ముక్కను నైవేద్యం పెట్టాలి)
ganesha3ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహిః ధియోయోనః ప్రచోదయాత్‌॥ సత్యం త్వరేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి (అని చెప్పి నైవేద్యముపై చుట్టూ నీటిని త్రిప్పి నైవేద్యంపై నీటిని అభికరించి ఎడమచేతితో కుడి చేతిని పట్టుకొని, కుడిచేతితో నైవేద్యాన్ని గణాధిపతికి చూపిస్తూ ఈ క్రింది మంత్రాలు చెప్పుకోవలెను).
ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహా,
ఓం వ్యానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా,
ఓం సమానాయ స్వాహా
శ్రీ మహాగణాధిపతయే నమః యథాభాగం
గుడం నివేదయామి (బెల్లం ముక్కను నివేదించాలి)
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి (నీటిని చల్లవలెను)
హస్తప్రోక్షయామి, పాదవ్ ప్రోక్షయామి, ముఖే ఆచమనీయ సమర్పయామి (4సార్లు నీళ్ళు చూపించి వదలాలి)
తాంబూలం సమర్పయామి (తాంబూలం ఉంచవలెను)
ఆచమనీయం సమర్పయామి (నీటిని చల్లవలెను)
ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి
(కర్పూరమును వెలిగించాలి)
శ్లో॥ వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ
అవిఘ్నంకురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా ॥
శ్రీ మహాగణాధిపతయే నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి.
గణాధిపతిః సుప్రీతః సుప్రసన్నో వరదో భవతు. మమ ఇష్టకామ్యార్థ ఫలసిద్ధ్యర్థం గణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి
(గణపతికి పూజచేసిన అక్షతలు కొన్ని తీసుకొని శిరస్సున ఉంచుకొనవలెను.)
శ్రీ మహాగణాధిపతిం యథాస్థానం ప్రవేశయామి
(పసుపు గణపతిని తూర్పునకు కొద్దిగా జరిపి మరల యథాస్థానంలో పెట్టాలి)
స్వామిన్, సర్వజగన్నాధ యావత్పూజావసానగా
తావత్త్వం ప్రీతిభావేన బింబేస్మిన్ సన్నిధింకురు
ధ్యానం : స్వామి వారి రూపాన్ని ఊహించుట (పువ్వులు, అక్షతలు చేతితో పట్టుకుని గణపతికి నమస్కరిస్తూ ఈ క్రింది ప్రార్థన చేసిన తరువాత ఆయన పాదాల వద్ద ఉంచాలి)
ఓం భవసంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణం ॥
విఘ్నాంధ కారభాస్వంతం విఘ్నరాజ మహం భజే ॥
ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం ॥
పాశాంకుశధరం దేవం ధ్యాయేత్సిద్ధి వినాయకమ్ ॥
ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం ॥
భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్న నాయకమ్ ॥
ద్యాయేద్గజాననం దేవం తప్తకాంచన సన్నిభం ॥
చతుర్భుజం మహాకాయం సర్వాభరణ భూషితం ॥
శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధివినాయక స్వామినే నమః ధ్యాయామి.

ఇంకా వుంది…..