Home ఖమ్మం పెద్దగోపారం వద్ద లారీ బోల్తా

పెద్దగోపారం వద్ద లారీ బోల్తా

LORRY
ఖమ్మం/ఎర్రుపాలెం ః మండల పరిధిలోని పెద్దగోపారం గ్రామంలో పత్తి లారీ బోల్తాపడిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. ఎపి 16టిఇ 3756 నెంబర్ గల పెద్దగోపారం మలుపు వద్ద అదుపు తప్పి బోల్తాకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు, పత్తి వ్యాపారి గుమాస్తా ఎస్‌కె.బాబుకు తీవ్రగాయాలై ఖమ్మం ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పత్తి వ్యాపారి గుమస్తా ఎస్‌కె.బాబు, లారీ డ్రైవర్ వి.సుబ్బారావు చెప్పిన వివరాల ప్రకారం సోమవారం ఏన్కూరు నుంచి సుమారు 150క్వింటాళ్ళ పత్తి కొనుగోలు చేసి విజయవాడకు చెందిన ఎపి 16టిఇ 3576గల లారీని కిరాయికి మాట్లాడుకుని మినుకొల్లుకు రవాణా చేస్తుండగా పెద్దగోపారం మూలమలుపు వద్ద డ్రైవర్ అతివేగంగా లారీని నడుపుతూ రోడ్డు పక్కనున్న ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొని పక్కనున్న పోలాల్లోకి దూసుకెళ్లి బొల్తా కొట్టింది. డ్రైవర్ అజాగ్రత్త వలన ఆర్‌అండ్‌బి దిక్సూచి బోర్డులు సరిగా కనిపించక ఈ ప్రమాదం జరిగినట్లు లారీ ఓనర్ తెలిపారు. ఈ ప్రమాదంలో లక్ష రూపాయల ట్రాన్స్‌ఫార్మర్ ధ్వసమై మీనవోలు గ్రామానికి కరెంట్ సరఫరా నిలిచిపోయింది. పెద్దగోపారం మలు పు వద్ద సూచికబోర్డులు స్పష్టంగా కనిపించకుండా ఏర్పాటు చేశారని, దీనిని సరిచేసి ప్రమాదాలను నివారించాలని ప్రజలు కోరుతున్నారు.