Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

విద్యుత్‌ తీగలు తగిలి గడ్డి లారీ దగ్ధం

Fire-Accident-in-Lorry

మంచిర్యాలటౌన్:  మంచిర్యాల మున్సిపల్ పరిధిలోని పాతమంచిర్యాల గ్రామంలో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది. వరిగడ్డితో వెళ్తున్న లారీ విద్యుత్ షాట్‌సర్క్యూట్‌తో వరిగడ్డితో పాటు లారీ పూర్తిగా కాలిపోయింది. ఇదే గ్రామానికి చెందిన సిద్దం వెంకటస్వామి గడ్డిలోడ్‌తో వ్యాన్‌ను ముందుకు తీసుకెళ్తుండగా విద్యుత్ వైర్లు తగిలి ఈ ప్రమాదం జరిగింది. అగ్నిమాపకసిబ్బంది  ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఈ ప్రమాదంలో సుమారు 20వేల విలువ గడ్డితో పాటు వ్యాన్ పూర్తిగా దగ్ధం కావడంతో సుమారు 14 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు పేర్కొన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments