Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

విద్యుత్ తీగలు తగిలి లారీ దగ్ధం

lorry burning with short circuit in siddipet district

ములుగు :ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు తగిలి పాత టైర్ల లారీ పూర్తిగా దగ్ధమైంది. లారీ డ్రైవర్ మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని మామిడాల వద్ద చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం ప్రకారం హైదరాబాద్ నుండి సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని కోట్యాల గ్రామంలో గల ఓ ప్రైవేట్ ప్యాక్టరీకి పాత టైర్లను లారీలో తరలిస్తుండగా మార్గ మధ్యంలో ని మామిడాల గ్రామం వద్ద విద్యుత్ వైర్లు తగిలి ఒక్కసారిగా లారీలో నుంచి మంటలు చెలరేగాయి. మంటల్లో గాయపడిన  డ్రైవర్ మహ్మద్ రఫిక్ (23)ను వెంటనే స్థానిక గజ్వేల్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మరణించాడు. క్లీనర్ కు స్వల్ప గాయాలయ్యాయి . మృతుడు మహ రాష్ట్ర లోని కేసర్ జవల్లా వాసిగా గుర్తించారు.
గత కొన్ని రోజుల క్రీతమే మరో లారీ దగ్ధం
గత కొన్ని రోజుల క్రీతం ఇదే ప్యాక్టరీలోకి పాత టైర్లను హైదరాబాద్ నుండి కోట్యాల గ్రామానికి లారీలో తీసుకు వస్తుండగా అడవి మసీదు గ్రామం వద్ద లారీలో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగి లారీ దగ్థమైంది. డ్రైవర్ లారిలో నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. ఈ రెండింటికి కారణం లారీలో అధిక లోడును తరలించడడమే కారణమని గ్రామస్థులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

Comments

comments