Home మల్కాజ్‌గిరి (మేడ్చల్) మంత్రి తలసానికి తప్పిన ప్రమాదం

మంత్రి తలసానికి తప్పిన ప్రమాదం

                   Car-accident

మన తెలంగాణ/కీసర: మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కీసర ఔటర్ రింగ్ రోడ్డుపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు త్రుటిలో ప్రమాదం తప్పింది. మంత్రి ప్రయాణిస్తున్న కారును ఢీ వెనుక నుంచి దూసుకొచ్చిన లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. శామీర్‌పేట మండలంలోని అంతాయిపల్లిలో మేడ్చల్ జిల్లా సమీ కృత కలెక్టరేట్ భవన సముదానికి శంకుస్థాపన చేసిన మంత్రి కారులో ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా కీసరలోని జిల్లా కలెక్టరేట్ ఆవరణలో జరుగుతున్న జిల్లా ఆవిర్భావ ప్రథమ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు వ స్తున్నారు. కాగా కీసర ఒఆర్‌ఆర్ జంక్షన్ సమీపంలో కారును రింగ్‌రోడ్డుపై ఎడమవైపు నిలిపి మంత్రి నీళ్లతో ముఖం శుభ్రం చేసుకుంటుండగా వెనకాల నుంచి వచ్చిన లారీ కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదం నుంచి మంత్రి త్రుటిలో తప్పించుకోగా, మేడ్చల్ ఎంఎల్‌ఎ సుధీర్‌రెడ్డి తలకు స్వల్పంగా గాయపడ్డారు. ఎంపి చామకూ ర మల్లారెడ్డి కారులోనే ఉన్నా సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదంలో కారు వెనుకభాగం పూర్తిగా దెబ్బ తింది. దేవుడి దయతోనే తాను ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డానని మంత్రి అన్నారు.