Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

నేటి నుంచి లారీల బంద్

Lorry Strike Start Today In Jayashankar District

మన తెలంగాణ/భూపాలపల్లి : నేటి నుంచి జిల్లాలో లారీల బంద్ జరుగుతున్న సందర్భంగా అత్యవసర సరుకులకు, కెటిపిపి బొగ్గు రవాణకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యాన్మాయ ఏర్పాట్లను చేయాలని జిల్లా కలెక్టర్ దుగ్యాల అమయ్ కుమార్ రవాణా పోలీసు శాఖల అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ పోలీస్, ట్రాన్స్ పోర్ట్, సింగరేణి, కెటిపిపి, రెవెన్యూ, పౌరసరఫరాల శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. స ందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నేటి నుంచి జాతీ య, రాష్ట్రీయ రహదారులపై ఒకే రకమైన పన్ను వి ధించాలని లోడింగ్, అన్‌లోడింగ్ సమయాల్లో హ మాలీలకు కూలీల చెల్లింపులను లారీలల్లో ఓనర్ లో డింగ్,ట్రక్స్ పార్కింగ్ స్థలాల్లో కేటాయింపు గ్రామ పంచాయతీ,స్థానిక పట్టణ పరిపాలన సంస్థల పరిదిలో తైబంది ఫీజుల విదింపులో తదితర సమస్యల ప రిష్కారానికై లారీ ఓనర్స్ అసోసియేషన్ దేశ వ్యాప్త ం గా బందుకు పిలుపు నివ్వడం జరుగుతుందని బంద్ ప్రభావం వల్ల నిత్యవసర సరుకులైన పాలు, కూరగాయలు,పండ్లు,ఇతర అహారా పదార్థాల సరఫరాకు, అలాగే నిరంతరం విద్యుత్‌ను అందిస్తున్నా కెటిపిపిలో విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గు సరఫరాకు ఉలాంటి ఆబ్బందులు కలగకుండా తగు ఏర్పాట్లు చే యాలని అన్నారు. జిల్లాలో అందుబాటులో ఉన్నాడి సిఎం వ్యానులను రవాణ అవసరాలకోసం నిత్యవస రా సరుకులను సరఫరా చేసేందుకు ఉపయోగించాల ని అన్నారు. పెట్రోల్ ,డిజల్ సరఫరాలకు అవరో దం కలగకుండా చూడాలన్నారు.కెటిపిపిలో విద్యుత్ సరఫరాకు రోజుకు సుమారు 15 వేల మె ట్రిక్ టన్నుల బొగ్గు అవసర మవుతుందని,భూపాలపల్లి సింగరేణి గనుల్లో ప్రతిరోజు ఉత్పత్తి అయ్యే 5 వేల మెట్రిక్ ట న్నుల బొగ్గును మొత్తం కెటిపికి పంపాలని లాగే గో దావరిఖని, ఉప్పల్ నుంచి లారీల ద్వారా పోలీస్ స హకారంతో బొగ్గును కెటిపిపికి సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. సరైన సమయంలో నిత్యవసరా సరుకులు,బొగ్గు రవాణకు సహకరించే లా జిల్లా లారీ ఓనర్స్ అసోసీయేషన్ నాయకులతో మాట్లాడాలని జిల్లా రవాణ శాఖ అధికారి రవిందర్‌ను ఆదేశించారు. బొగ్గును, కెటిపిపి నుంచి యా ష్ ను, ఇసుక లారీలతో నిర్ణీత స్థాయికి మించి అధికలోడ్‌లో వెల్లకుండా కట్టుదిట్టంగా చర్యలు తీసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఆర్ భాస్కరన్, డిఆర్‌ఓ మోహన్‌లాల్, కెటిపిపిసీఇ ఎం సిద్దయ్య, డిఎం అక్ష్మిదర్మా, పద్మనాభ రెడ్డిలు పాల్గొన్నారు.

Comments

comments