Search
Monday 24 September 2018
  • :
  • :

లారీల సమ్మెతో ముందస్తు

 Lorry strike  Without any difficulties for the common people

మన తెలంగాణ/రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: లారీల సమ్మెతో సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ హరీష్ అధికారులను ఆదేశించారు. నేటి నుంచి లారీ యజమానులు సమ్మెకు దిగుతుండటంతో గురువారం కలెక్టరేట్‌లో రవాణా, పౌర సరఫరాల శాఖ అధికారు లు, ఎల్‌పిజి డీలర్ల ప్రతినిధులతో జాయింట్ కలెక్టర్ హరీష్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అయిల్ కంపెనీల నుంచి పెట్రోల్ పంపులకు పెట్రోల్, డీజిల్ సరఫరా చేయడానికి ప్రత్యేక చర్యలు చేపట్టడంతో పాటు అవసరమైన రూట్‌లలో పోలీసుల సహాయం తీసుకోవాలన్నారు. లారీలకు భద్రత కోసం ముందస్తుగానే లారీల వివరాలు తెలియచేయాలని కోరారు. సమ్మెలో పాల్గొనకుండా తమలారీలు వినియోగించేవారికి కూడా తగు భద్రత కల్పిస్తామన్నారు. టియస్ ఆర్‌టిసి బస్సులో నిత్యావసర వస్తువులైన పాలు, కూరగాయలు వంటివి రవాణ చేసేందుకు అనుమతించేందుకు సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీచేయాలని, రవాణ చార్జీలు సాదారణ చార్జీల మాదిరిగానే వసూలు చేయాలన్నారు. ప్రజల ఇబ్బందులు పడకుండా కావలసిన అన్ని చర్యలు చేపట్టాలన్నారు. ఫౌర సరఫరాలు, రవాణ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి నిత్యావసర వస్తువుల పంపిణిలో ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

Comments

comments