Search
Saturday 17 November 2018
  • :
  • :

పెరిగిన కరెంట్ ఖాతా లోటు

ఎగుమతులూ వృద్ధి

 నాలుగేళ్ల గరిష్ట స్థాయికి
 ఏప్రిల్ – జూన్ కాలంలో 14.3 బిలియన్ డాలర్లు
 2.4 శాతానికి పెరిగింది: ఆర్‌బిఐ

RBIఆగస్టు నెలలో దేశీయ ఎగుమతులు 10.29 శాతానికి పెరిగాయి. ఇంజినీరింగ్, పెట్రోలియం, కెమికల్స్, ఫా ర్మాస్యూటికల్స్ ఉత్పత్తుల ఎగుమతులు పెరగడమే ఇం దుకు కారణం.. శుక్రవారం ప్రభుత్వం ఈ గణాంకా లను వెల్లడించింది. వరుసగా పన్నెండో నెల ఎగుమతు ల్లో వృద్ధి నమోదైంది. ముడి చమురు, బంగారం వంటి వాటికి డిమాండ్ కారణంగా దిగుమతులు కూడా 21.02 శాతం మేరకు పెరిగాయి. ఆగస్టు నెలలో దిగు మతులు 35.46 బిలియన్ డాలర్లుగా ఉండగా, గత ఏడాది ఇదే సమయంలో 29.30 బిలియన్ డాలర్లు మాత్రమే నమోదైంది. గత నెలలో వాణిజ్య కొరత 11.64 బిలియన్ డాలర్లకు పెరగ్గా, గత సంవత్సరం ఇదే సమయంలో ఇది 7.7 బిలియన్ డాలర్లుగా ఉంది. ఆగస్టులో బంగారం దిగుమతులు 1.88 బిలయన్ డా లర్లతో 68.90 శాతం పెరిగాయి. గత ఏడాదిలో పసిడి దిగుమతులు 1.11 బిలియన్ డాలర్లు మాత్రమే ఉంది. చమురు దిగుమతులు 7.75 బిలియన్ డాలర్లు నమోద య్యాయి. 2016లో ఇదే నెలతో పోలిస్తే బంగారం దిగుమతులు ఈసారి 14.22 శాతం పెరిగినట్టు గణాం కాలు చెబుతున్నాయి. 201718 ఏప్రిల్‌ఆగస్టులో క్యూములేటివ్ ఎక్స్‌పోర్ట్ 118.57 బిలియన్ డాలర్లతో 8.57 శాతం పెరగ్గా, దిగుమతులు 181.71 బిలియన్ డాలర్లతో 26.63 శాతం పెరిగాయి. వాణిజ్య లోటు 63.14 బిలియన్ డాలర్లుగా ఉంది.

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రమాసికంలో కరెంట్ ఖాతా లోటు(క్యాడ్) పెరిగింది. ఏప్రిల్- జూన్ కాలంలో జిడిపి(స్థూల దేశీయోత్పత్తి)లో ఆర్థిక లోటు 14.3 బిలియన్ డాలర్లు అంటే 2.4 శాతానికి పెరిగింది. సంవత్సరం క్రితం ఈ లోటు 0.4 బిలియన్ డాలర్లుగా మాత్రమే ఉంది. మార్చి ముగింపు నాటి త్రైమాసికంలో 3.4 బిలియన్ డాలర్లు(0.6 శాతం)తో పోల్చినా ప్రస్తుత ఆర్థిక లోటు అత్యంత గరిష్ఠ స్థాయిలో నమోదైంది. దిగుమతులు పెరగడం వల్ల నాలుగేళ్లలో ఈసారి అత్యధిక స్థాయికి ఆర్థిక లోటు చేరింది. శుక్రవారం ఆర్‌బిఐ ఈ గణాంకాలను వెల్లడించింది. ఏడాది- ఏడాది ఆధారంగా చూస్తే ఆర్థిక లోటు పెరగడానికి ప్రధాన కారణం వాణిజ్య లోటు అధికం కావడమేనని ఆర్‌బిఐ వెల్లడించింది. 41.2 బిలియన్ డాలర్లతో వాణిజ్య లోటు కాణంగా క్యాడ్ పెరిగిందని, దిగుమతులు కూడా గణనీయంగా పెరగడం దీనిపై ప్రభావం చూపిందని సెంట్రల్ బ్యాంక్ వెల్లడించిం ది. గత నెలలో వాణిజ్య కొరత 11.64 బిలియన్ డాలర్ల కు పెరగ్గా, గత సంవత్సరం ఇదే సమయంలో ఇది 7.7 బిలియన్ డాలర్లుగా ఉంది. ఆగస్టు నెలలో దిగుమతులు 35.46 బిలియన్ డాలర్లుగా ఉండగా, గత ఏడాది ఇదే సమయంలో 29.30 బిలియన్ డాలర్లు మాత్రమే నమో దైంది. నికర సేవల వసూళ్లు 15.7 శాతానికి పెరగడా నికి ప్రధాన కారణం ట్రావెల్, కన్‌స్ట్రక్షన్, ఇతర వ్యాపార సేవల నుంచి నికర ఆదా యంలో వృద్ధియే అని ఆర్‌బిఐ వెల్లడించింది. ఆర్‌బిఐ గణాంకాల ప్రకారం, ఆర్థిక ఖాతా లో నికర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 7.2 బిలియన్ డాల ర్లకు చేరాయి. అంటే సంవత్సరం క్రితంతో పోలిస్తే ఈసా రి దాదాపు రెట్టింపయ్యాయి.

Comments

comments