Home జగిత్యాల తడిసిన ధాన్యం… కుదేలైన రైతు

తడిసిన ధాన్యం… కుదేలైన రైతు

Loss-of-farmers-image

అకాల వర్షంతో రైతన్నకు నష్టం

గత రెండు రోజులుగా రాష్ట్రంలోనే అత్యధిక పగటి ఉష్ణోగ్రత లతో రికార్డు సృష్టించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాలు గురువారం నాటి అకాల వర్షంతో తడిసి ముద్ద య్యాయి. భారీగా ఈదురుగాలులతో కురిసిన వర్షం సామన్య ప్రజలకు వేసవి తీవ్రత నుండి ఉపశమనం కలిగించినా రైతు లకు మాత్రం తీరని నష్టాన్ని మిగిల్చింది. రాష్ట్రంలోనే మామిడి తోటలకు ప్రసిద్ధిగాంచిన జగిత్యాల జిల్లాలో రైతులు భారీగా  పంటలను నష్ట పోయారు. ఈసారి దిగుబడి అంతంతమాత్రం గానే ఉన్న తరుణంలో ఇప్పటికే రెండు సార్లు వడగండ్లు, ఈ దురుగాలుల వర్షాలతో మామిడి దెబ్బతినడంతో ఈ ప్రాంత రై తులు కోలుకోలేని నష్టాన్ని చవిచూశారు.