Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

రూ.57,334 కోట్ల మార్కెట్ విలువ ఢమాల్

bs

టాప్ 10లో ఐదు కంపెనీలకు నష్టాలు

న్యూఢిల్లీ: గతవారం టాప్ 10 బ్లూచిప్ కంపెనీల్లో ఐదు కంపెనీల మార్కెట్ విలువ(మార్కెట్ క్యాపిటలైజేషన్) రూ.57333.55 కోట్లు తుడిచిపెట్టుకుపోయింది. వీటిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అత్యంతగా మార్కెట్ విలువను కోల్పోయింది. ఇంకా ఐటిసి, హెచ్‌డిఎఫ్‌సి, మారుతీ సుజుకీ, ఒఎన్‌జిసి వంటి కంపెనీలు ఎంక్యాప్(మార్కెట్ క్యాపిటలైజేషన్) కూడా హరించుకుపోయింది. టిసిఎస్(టాటా కన్సెల్టెన్సీ సర్వీసెస్), హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, హిందుస్తాన్ యునిలీవర్ లిమిటెడ్(హెచ్‌యుఎల్), ఇన్ఫోసిస్, కోటక్ మహీంద్రా బ్యాంక్ వంటి కంపెనీల ఎంక్యాప్ పెరిగింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ రూ. 34,908 కోట్లు కోల్పోయి రూ.5,91,353 కోట్లకు చేరింది. హెచ్‌డిఎఫ్‌సి విలువ కూడా రూ.10,582 కోట్లు నష్టపోయి రూ.3,11,483 కోట్లు కాగా, మారుతీ సుజుకీ విలువ రూ.6,819.46 కోట్లు పడిపోయి రూ. 2,57,147 కోట్లకు చేరింది. చమురు దిగ్గజం ఒఎన్‌జిసి మార్కెట్ విలువ విషయానికొస్తే రూ.2,887 కోట్ల నష్టపోయి రూ.2,37,479 కోట్లకు చేరింది. ఐటిసి ఎంక్యాప్ రూ.2,136 కోట్లు క్షీణించి రూ.3,44,344 కోట్లు అయింది. మరోవైపు హిందుస్తాన్ యునిలీవర్ విలువ రూ.21,169 కోట్లు జంప్ చేసి రూ.3,47,212 కోట్లకు చేరింది. టిసిఎస్ మార్కెట్ విలువ రూ.7,992 కోట్లు పెరిగి రూ.6,70,451 కోట్లు అయింది. కోటక్ మహీంద్రా విలువ రూ.5,489 కోట్లు లాభపడి రూ. 2,46,654.92 కోట్లకు చేరింది. ఐటి దిగ్గజం ఇన్ఫోసిస్ విషయానికొస్తే మార్కెట్ విలువ రూ.600.63 కోట్లు జంప్ చేసి రూ.2,58,546 కోట్లు కాగా.. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఎంక్యాప్ రూ.584.32 కోట్లు పుంజుకుని రూ.5,22,745 కోట్లు అయింది. టాప్ 10 ర్యాంకింగ్ చూస్తే.. ఐటి దిగ్గజం టిసిఎస్ మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా ఆర్‌ఐఎల్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, హెచ్‌యుఎల్, ఐటిసి, హెచ్‌డిఎఫ్‌సి, ఇన్ఫోసిస్, మారుతీ సుజుకీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఒఎన్‌జిసి సంస్థలు ఉన్నాయి. కాగా గతవారం సెన్సెక్స్ సూచీ కీలక 35 వేల స్థాయిని, నిఫ్టీ- సూచీ 10,600 స్థాయిని కోల్పోయాయి. కర్నాటక రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. వరుసగా నాలుగో రోజు స్టాక్‌మార్కెట్లు నష్టాలను నమోదు చేశాయి. శుక్రవారం సెన్సెక్స్ 301 పాయింట్ల నష్టంతో 34,848 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 86 పాయింట్లు క్షీణించి 10,596 పాయింట్ల వద్ద ముగిసింది. ఎఫ్‌ఎంసిజి రంగానికి చెందిన సూచీ మినహా మిగతా అన్ని సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఈ వారం మొత్తం మీద స్టాక్ సూచీలు 2 శాతం మేర పతనమయ్యాయి. ఒకేవారంలో ఇంతగా సూచీలు నష్టపోవడం రెండు వారాల తర్వాత ఇదే మొదటిసారి కావడం గమనార్హం.

Comments

comments