Home తాజా వార్తలు టాప్ 9 కంపెనీలకు నష్టాలు

టాప్ 9 కంపెనీలకు నష్టాలు

Nine Companies in top 10

 

మొత్తంగా మార్కెట్ విలువ రూ.98,862 కోట్లు ఆవిరి

న్యూఢిల్లీ: గతవారం టాప్ 10 కంపెనీల్లో తొమ్మిది కంపెనీలు దాదాపు రూ.98,862 కోట్ల మార్కెట్ విలువను కోల్పోయాయి. పది కంపెనీల్లో ఒక్క ఐటిసి మినహా అన్ని సంస్థలు నష్టాలను చవిచూశాయి. అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్ రూ.21,456 కోట్లు నష్టపోయింది. ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ. 7,88,213.12 కోట్లకు పడిపోయింది. ఇక ఎస్‌బిఐ(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) మార్కెట్ విలువ రూ. 19,723.34 కోట్లు తగ్గి రూ. 2,34,672 కోట్లకు చేరింది. టిసిఎస్ మార్కెట్ విలువ రూ. 11,951 కోట్లు కోల్పోయి రూ.7,62,071 కోట్లకు చేరింది. హెచ్‌డిఎఫ్‌సి మార్కెట్ విలువ రూ.11,725 కోట్లు తగ్గి రూ.3,22,531.39 కోట్లుగా ఉంది.

హిందుస్థాన్ యునిలివర్ లిమిటెడ్(హెచ్‌యూఎల్) రూ. 9,600.22కోట్లు, ఐసిఐసిఐ బ్యాంక్ రూ. 8,293.27 కోట్లు, ఇన్ఫోసిస్ రూ. 7,906.92కోట్లు, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ రూ. 5,998.66కోట్లు, కొటక్ మహింద్రా బ్యాంక్ రూ. 2,207.26 కోట్ల మేర నష్టపోయాయి. ఐటిసి మార్కెట్ విలువ మాత్రం రూ.4,593 కోట్లు పెరిగి రూ. 3,42,495 కోట్లకు చేరింది. గతవారం స్టాక్‌మార్కెట్లు ఆద్యంతం నష్టాలను చవిచూశాయి. ర్యాంకింగ్ పరంగా చూస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా టిసిఎస్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, హెచ్‌యుఎల్, ఐటిసి, ఇన్ఫోసిస్, హెచ్‌డిఎఫ్‌సి, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎస్‌బిఐ, ఐసిఐసిఐ బ్యాంక్‌లు ఉన్నాయి.

Losses to Nine Companies in top 10