Home జాతీయ వార్తలు పెళ్లి వద్దన్నందుకు… యువకుడు, వివాహిత ఆత్మహత్య

పెళ్లి వద్దన్నందుకు… యువకుడు, వివాహిత ఆత్మహత్య

Suicide

 

 

లక్నో: ప్రేమికుల రోజున ఓ వివాహిత, యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉత్తర ప్రదేశ్ లోని దాతాగంజ్ రైల్వే క్రాసింగ్ వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఓ యువకుడు పక్కింటి మహిళతో ప్రేమలో పడ్డాడు. సదరు మహిళకు పెళ్లై పిల్లలున్నారు. వాలంటైన్స్ డే రోజున తాము పెళ్లి చేసుకుంటామని వివాహిత, యువకుడు అనుకున్నారు. వారి పెళ్లికి స్థానికులు, బంధువులు అడ్డుచెప్పడంతో ప్రేమజంట రైలు కిందపడి ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించింది. ఈ ఘటనలో యువకుడు దుర్మరణం చెందగా మహిళ తీవ్రంగా గాయపడింది. రైల్వే అధికారుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని మహిళను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతుడు నవదావన్ గా(25) గుర్తించారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

 

Love Couple Commit Suicide in UttarPradesh