Home తాజా వార్తలు రామన్నపేటలో ప్రేమజంట ఆత్మహత్య

రామన్నపేటలో ప్రేమజంట ఆత్మహత్య

               Love Couple Commit Suicide in Adilabad

యాదాద్రి భువనగిరి: ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలోని రామన్నపేటలో శనివారం ఉదయం జరిగింది.  గణేష్, పూజిత అనే ప్రేమజంట రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడింది.  మృతులు నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లి మండలం పల్లెపాడుకు చెందిన వారిగా గుర్తించారు.  పెద్దలు తమ పెళ్లికి ఒప్పుకోకపోవడంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ నోట్ రాశారు. రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.