Home తాజా వార్తలు గోల్కొండ కోటలో ప్రేమజంట ఆత్మహత్యయత్నం..

గోల్కొండ కోటలో ప్రేమజంట ఆత్మహత్యయత్నం..

Love Couple Sucide At Golconda Fort

హైదరాబాద్ :  ప్రేమ వ్యవహారంపై కుటుంబసభ్యు లు మందలించడంతో మనస్తాపం చెందిన ఓ ప్రేమ జంట గోల్కొండ కోటపై నుంచి దూకి ఆత్మహత్య యత్నానికి పాల్పడి ఆస్పత్రి పాలైన సంఘటన గోల్కొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యూసుఫ్‌గూడ రహ్మత్‌నగర్‌కు చెందిన శరత్, బంజారాహిల్స్‌కు చెందిన సుష్మ ప్రేమికులు. ఈ ప్రేమ వ్యవహారం ఇంట్లో వాళ్లకు తెలియడంతో వీరిని మందలించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఇద్దరూ గోల్కొండకు చేరుకొని ఆత్మహత్య చేసుకునేందుకు కోటపై నుండి దూకారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వెంటనే ఇద్దరినీ దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరిలో సుష్మ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.