Search
Sunday 18 November 2018
  • :
  • :

ప్రేమజంట ఆత్మహత్యాయత్నం… అమ్మాయి మృతి!

lu

కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళ్శేశ్వరం దేవస్థానం సమీపంలో ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో అమ్మాయి మృతి చెందగా, అబ్బాయి ఆస్పత్రిలో అపస్మారక స్థితిలో ఉన్నాడు. వరంగల్ జిల్లా హన్మకొండలోని సుబేదారికి చెందిన మెరుగు హరిప్రియ(17), పెండ్యాల సాయికుమార్ (18) ఇద్దరు కొంతకాలంగా ప్రేమించుకున్నారు. ఇంట్లోనుంచి పారిపోయి కాళేశ్వర ఆలయం సమీపంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీన్ని గమనించి స్థానికులు 108కు సమాచారం ఇవ్వడంతో సిబ్బంది వెంటనే మహదేవపూర్‌కు తరలించారు. అప్పటికే హరిప్రియ మరణించింది. సాయికుమార్ పరిస్థితి విషమంగా ఉండటంతో వరంగల్ ఎంజిఎం ఆస్పత్రికి తరలించారు. అయితే అమ్మాయి మైనర్ కావడంతో సబేదారి పోలీస్టేషన్‌లో సాయికుమార్‌పై కిడ్నాప్ కేసు నమోదైనట్లు సమాచారం.

Comments

comments