Home జాతీయ వార్తలు ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

Love Couple Suicide Attempt at Kumaradeva

పశ్చిమగోదావరి : ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన కొవ్వూరు మండలం కుమారదేవలో మంగళవారం ఉదయం జరిగింది. వీరి కులాలు వేరుకావడంతో పెళ్లికి ఇరుకుటుంబాల పెద్దలు అంగీకరించలేదు. దీంతో మనస్థాపానికి గురైన ఈ ప్రేమజంట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. వీరి పరిస్థితి విషమంగా ఉండడంతో రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Love Couple Suicide Attempt at Kumaradeva