Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

రావులపల్లిలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

LOVE

వికారాబాద్ : కొడంగల్ మండలం రావులపల్లిలో శుక్రవారం ఉదయం ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేసింది. గ్రామానికి చెందిన రాజు (30), జ్యోతి (25) ధర్మాపూర్ గనుల సమీపంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. గమనించిన స్థానికులు వారిని కొడంగల్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం తాండూరు ఆస్పత్రికి తరలించారు. జ్యోతి పరిస్థితి విషమంగా ఉంది. వీరి ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడం వల్లనే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.  ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Love Couple Suicide attempt at Ravulapally on Friday

Comments

comments