Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

ప్రేమ భావం ఒక్కటే

trivkramత్రివిక్రమ్ ప్రొడక్షన్ నం.1 సినిమా హైదరాబాద్‌లోని ఫిలింనగర్ దేవాలయంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు రాజేష్, నిర్మాత యస్.త్రివిక్రమ్ మిగతా యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. పవన్, ప్రియ స్వీటీ హీరోహీరోయిన్‌లుగా బేబి మోక్ష ఓ ముఖ్య పాత్రలో నటిస్తోంది. ఈ సందర్భంగా దర్శకుడు రాజేష్ యడమ మాట్లాడుతూ “ఇదొక ప్రేమ కథ. నేటి యువత ఎలా ఉందో చూపించే చిత్రమిది. ఒక్కసారి ప్రేమిస్తే జీవితాంతం అమ్మాయి చేయి వదలి పెట్టకూడదని చెప్పే సినిమా ఇది. ఈనెల 15 నుంచి ఏకధాటిగా షూటింగ్ చేస్తాం. ఈ సినిమాను మూడు షెడ్యూళ్లలో పూర్తిచేస్తాం”అని అన్నారు. నిర్మాత ఎస్.త్రివిక్రమ్ మాట్లాడుతూ “యువతకు నచ్చే చిత్రమిది. ఇందులో సందేశం కూడా ఉంటుంది. ప్రేమను వ్యక్తీకరించే విధాలు వేరుగా ఉన్నా… ప్రేమ భావం ఒక్కటే అనే కథతో సినిమా తెరకెక్కనుంది”అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరాః పురుషోత్తం, సాహిత్యంః నాగబాబు, సంగీతంః వియస్‌ఎన్, డ్యాన్స్‌ః రామారావు.

Comments

comments