Home తాజా వార్తలు ప్రాణాలు తీసిన ప్రేమ వ్యవహారం

ప్రాణాలు తీసిన ప్రేమ వ్యవహారం

Mother - Daughter Committed Suicide

కాకినాడ: శంఖవరంలో శుక్రవారం ఉదయం దారుణం వెలుగులోకి వచ్చింది. ప్రేమ వివాహం కారణంగా ఇద్దరు వ్యక్తులను సజీవ దహనం చేశారు. దీంతో శంఖవరంలో సెక్షన్ 144ను పోలీసులు అమలు చేస్తున్నారు. పాతకక్షల నేపథ్యంలో గురువారం ఓ ఇంట్లో దాక్కున్న ఇద్దరు అన్నదమ్ములు నూకరాజు, ప్రసాద్ ను ప్రత్యర్థులు సజీవ దహనం చేశారు. మృతుడు నూకరాజు  ప్రేమ వివాహం చేసుకోవడంతో అమ్మాయి తరపు బంధువులు నూకరాజుతో పలుమార్లు గొడవకు దిగారు. గతంలో నూకరాజు తన తమ్ముడు ప్రసాద్ తో కలిసి సుధాకర్‌పై కత్తితో దాడి చేశాడు. సుధాకర్ వారిపై కక్ష పెంచుకొని.. నూకరాజు ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించడంతో ఘటనా స్థలంలో అన్నదమ్ములిద్దరు కాలి బూడదయ్యారు. పోలీసుల అదుపులో ప్రధాన నిందితుడు సుధాకర్ సహా పలువురిని పోలీసులు అరెస్టు చేశారు.