Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

ఆత్మహత్య చేసుకుందామని పిలిచి.. రైలు కిందకు తోసేశాడు!

Girl-Lost-Legsఆరేళ్లుగా ఆ ఆమ్మాయి అతన్ని ప్రాణంగా ప్రేమిస్తుంది. అతడు కూడా ఆమె అంతే ప్రేమిస్తున్నాడని భ్రమపడింది. కానీ అతను మాత్రం ఆ అమ్మాయిని ఎప్పుడు వదిలించుకుందామనే ఆలోచనలో ఉన్నాడు. వివరాల్లోకి వెళ్తే.. విజయనగరం జిల్లా చీపురుపల్లికి చెందిన నీలవేణి అనే యువతి రామకృష్ణ అనే యువకుడు గత ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కాగా ఈ మధ్య కాలంలో వారిద్దరి ప్రేమ విషయంలో వచ్చిన సమస్యల తలెత్తాయి. ఆ గొడవలను ఆ అమ్మాయిని వదిలించుకొనేందుకు ఉపయోగించుకోవాలని రామకృష్ణ పథకం వేశాడు. అందులో భాగంగా ఆత్మహత్య చేసుకుందాని నీలవేణిని రైలు పట్టాల వద్దకు రమన్నాడు. తీరా రైలు వచ్చే సమయానికి నీలవేణిని రైలు కిందకు తోసేసి తాను పరారయ్యాడు. ఈ ప్రమాదంలో నీలవేణి రెండు కాళ్లు కోల్పోయింది. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments