Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

చికిత్సపొందుతూ ప్రేమికురాలి మృతి

                  Love-Cut-Blade

చండ్రుగొండ : మండల పరిధిలో బాలికుంట గ్రామంలోని బోడా నాగలక్ష్మి(21) అనే యువతి శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. పోలీసుల కధనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి …బాలికొండ గ్రామానికి చెందిన నాగలక్ష్మి కొత్తగూడెం కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరము చదువుతుంది. బాలికుంట ప్రక్క గ్రామమైన బెండాలపాడు గ్రామానికి చెందిన ఇస్లావత్ నర్సింహ ఒకే కాలేజీలో డిగ్రీ చదువుతున్నారు.ఇరువురు గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ నెల 21న బెండాలపాడు గ్రామంలో బందువుల వివాహానికి రావలసిందిగా నాగలక్ష్మిని నర్సింహం కోరారు. వివాహానికి ఆమేహాజరు కాలేదు.

ఈ విషయంపై ఇరువురు మద్య ఫోన్లో వాధన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో 25న పురుగుమందు త్రాగి నాగలక్ష్మి బలవన్మరణానికి ప్రయత్నించింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను కొత్తగూడెం వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ 26 వ తేదీ అర్ధరాత్రి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతు రాలు తండ్రి పిర్యాదు పేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నుట్లు ఎఎస్సై హూస్సేన్ తెలిపారు.

Comments

comments