Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

పెళ్లి చేసుకుంటానని మోసం

మనస్తాపంతో ప్రియురాలి ఆత్మహత్య

ఇరు గ్రామాల్లో ఉద్రిక్తత, పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన వివాదం

Suicide

మనతెలంగాణ/ నిజామాబాద్/నందిపేట: పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి మోసం చేసిన ప్రియుడి చర్యలతో మనస్తాపం చెందిన ప్రియురాలు ఆత్మహత్య చేసుకున్న సంఘటన నందిపేట మండలంలో మంగళవారం వెలుగు చూసింది. పోలీసులు, బాధిత కుటుంబీకుల వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం లక్కంపల్లి గ్రామానికి చెందిన నవనూర్ గంగలత (18), పక్కనే ఉన్న తల్వేద గ్రామానికి చెందిన గాడి గంగాధర్‌లు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.

గంగాధర్ తనను పెళ్లి చేసుకోవడం లేదని మనస్తాపం చెందిన గంగలత సోమవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తీవ్ర గాయాలైన ఆమెను జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందింది. గంగలత మృతి వార్త తెలియగానే నిందితుడు గంగాధర్‌తోపాటు ఆయ న కుటుంబీకులు ఇంట్లో నుండి పరారయ్యారు.

మంగళవారం ఉదయం గ్రామస్తుల సహాయంతో తల్వేద గ్రామానికి వెళ్ళిన బాధిత కుటుంబీకులు తమ కూతురు మృతికి కారకులైన వారి ఇంటి ముందే ఆమె శవాన్ని పూడ్చిపెడతామంటూ ఆందోళనకు దిగి నిందితుని ఇంటి ముందు గొయ్యిని తవ్వారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం మేరకు ఎస్‌ఐ సంతోష్‌కుమార్ సంఘటన స్థలానికి నిందితునికి శిక్ష పడేలా చూస్తామని ఎస్‌ఐ చెప్పడంతో బాధిత కుటుంబీకులు ఆందోళనను విరమించారు.

Comments

comments