Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

సంధ్యరాణి.. చివరి మాటలు…(వీడియో)

Sandhya-Rani

హైదరాబాద్: ప్రేమోన్మాది పెట్రోల్ దాడిలో తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం ప్రాణాలొదిలిన సంధ్యరాణి చివరిసారిగా మాట్లాడిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఈ వీడియోలో తనపై పెట్రోల్ పోసి నిప్పంటించింది కార్తీక్ అని స్పష్టంగా చెప్పింది. అలాగే అతడి చెల్లెలు నదియా తనతో కలిసి తార్నాకలోని బిగ్ బజార్‌లో పని చేస్తుందని పేర్కొంది. ఈ ఘటనకు ముందు కార్తీక్ తనతో కొద్దిసేపు మాట్లాడాడని అనంతరం అతడు తనతో పాటు తీసుకొచ్చిన పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు తెలిపింది. ఇదిలాఉండగా తనను ప్రేమించి.. పెళ్లికి నిరాకరించడంతోనే తనకు దక్కనిది ఎవరికి దక్కకూడదని పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు నిందితుడు కార్తీక్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నాడు.

Comments

comments