Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

ప్రియురాలిని చంపి పాతిపెట్టాడు

ఆపై మరో పెళ్లి, యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం 

Murder-in-Bujalapuram

మన తెలంగాణ/ మోత్కూరు : ప్రేమ పేరుతో మోసపోయి న ఓ యువతి ప్రియుడి చేతిలో దారుణ హత్యకు గురైన సంఘటన మంగళవారం సాయంత్రం యాదాద్రి భువనగి రి జిల్లా మోత్కూరు మండలంలోని బుజిలాపురం గ్రామం లో వెలుగు చూసింది. పోలీసులు, గ్రామస్తులు, మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం మోత్కూరు మండల కేంద్రానికి చెందిన బొడ్డుపల్లి భార్గవి(23) ఆత్మకూరు(ఎం)లో వినాయక ఆస్పత్రిలో రిసెప్షనిస్టుగా విధు లు నిర్వహిస్తుంది. అదే మండ లంలోని బుజిలాపురం గ్రా మానికి చెందిన కాసగాని నరేందర్‌గౌడ్ అలియాస్ నందు గతంలో వినాయక ఆస్పత్రిలో అంబులెన్సు డ్రైవర్‌గా పని చేశాడు.

ఆంబులెన్సు డ్రైవర్‌గా పని చేస్తున్న సమయంలో నరేందర్‌తో భార్గవికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దీంతో గత 5సంవత్సరాలుగా ఇ రువురి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుంది. కాగా నరేందర్‌కు జనగాం జిల్లా గుండాల మండలం సుద్దాల గ్రామానికి చెందిన ఓ యువతితో పెళ్ళి కుదిరింది. పెళ్ళి కుదిరి న వి షయం తెలిసిన భార్గవి నరేందర్‌ను నిలదీయడంతో పెళ్ళికి ముందురోజు భార్గవిని తన వ్యవసాయ బావివద్ద కు తీసుకెళ్లి మాయ మాటలు చెప్పి బండ రాయికి మోది దారుణంగా హత మార్చి, అక్కడే పూడ్చిపెట్టి నరేందర్ ఇంటికి వెళ్లి పెళ్లికి సిద్ధ్దమయ్యాడు.

తన కూతురు భార్గవి విధులకు వెళ్లి తిరిగి ఇంటికి రాకపోవడంతో తండ్రి ల క్ష్మయ్య తెలిసిన వారి వద్ద వెతికాడు. కూతురు ఆచూకి లభ్యం కాకపోవడంతో ఆత్మకూరు(ఎం) పోలీసు స్టేషన్ లో సోమవారం ఫిర్యాదు చేశాడు. అనుమానంతో నరేందర్‌ను అదుపులోకి తీసుకొని విచారించడంతో భార్గవిని హత్యచేసి పూడ్చిపెట్టిన ట్లు ఒప్పుకున్నాడు. దీంతో మోత్కూరు, ఆత్మకూరు ఎస్‌ఐలు యం. సత్యనారాయణ, యాదగిరిలు తమ సిబ్బందితో ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికి తీసారు. అనంతరం చౌటుప్పల్ ఎసిపి రమేశ్ రామన్నపేట సిఐ శ్రీని వాస్ సంఘటన స్థలాన్ని పరిశీలించా రు. రామన్నపేట ఏరియా ఆసుపత్రికి పోస్టు మార్టం ని మిత్తం మృతదేహాన్ని తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Comments

comments