Search
Wednesday 21 November 2018
  • :
  • :

గర్భవతిని చేసి ముఖం చాటేసిన ప్రియుడు

గర్భవతిని చేసి ముఖం చాటేసిన ప్రియుడు
ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి ధర్నా
కుటుంబ సభ్యులతో కలిసి ధర్నా కొన్నసాగిస్తున్న బాధితురాలు

ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి ధర్నా

ప్రేమ పేరుతో వంచన

Lover-Strike

మన తెలంగాణ/నల్లగొండ టౌన్ : గత మూడు సంవత్సరాలుగా ప్రేమగా నటించి శారీరకంగా లోబర్చుకొని గర్భవతిని చేసి ముఖం చాటేసిన ప్రియుడి ఇంటిముందు న్యాయం కోరుతు ప్రియురాలు తమ కుటుంబ సభ్యులతో ధర్నాకు దిగింది. నల్లగొండ మండలం మేళ్లదుప్పలపల్లి గ్రామానికి చెందిన పాలడుగు ప్రేమలత ఎమ్మెస్సీ, బిఈడి చదివి ఇంటిదగ్గరే ఉంటుంది. అదే గ్రామానికి చెందిన పొరుగున ఉన్న పగడాల రమేష్ ప్రేమ పేరుతో ప్రేమలత వెంట పడ్డాడు. గత మూడేళ్లుగా ప్రేమగా నటిస్తూ పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పి ఆమెను శారీరకంగా లోబర్చుకుని గర్భవతిని చేశాడు. ఇటీవల పగడాల రమేష్ కానిస్టేబుల్‌గా ఎంపిక కావడంతో ప్రేమలతను నిరాకరిస్తూ వచ్చాడు. ప్రియుడు ముఖం చాటేసిన విషయం తెలుసుకున్న ప్రేమలత న్యాయం కోసం పెద్దల సమక్షంలో పంచాయితి పెట్టింది. ప్రియుడు రమేష్ పెళ్లి చేసుకునేందుకు నిరాకరించడంతో విధిలేని పరిస్థితిలో తన బంధువులు, కుటుంబ సభ్యులతో కలసి ప్రియుడి ఇంటిముందు నిరవధిక ధర్నాకు దిగింది. తనను ప్రేమ పేరుతో వంచించి గర్భవతిని చేసిన రమేష్‌పై తగిన చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించనున్నట్లు బాధితురాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చింతల కళమ్మ, ఎంపిటిసి పొడిచేటి లలితా రవీందర్, మనిమద్దె యల్లయ్య, కొండేటి గండయ్య, మనిమద్దె నర్సింహ్మ, చింతల భిక్షం, మనిమద్దె జానయ్య, మనిమద్దె వెంకన్న, మేకల వెంకటేశం, జేరిపోతుల శ్రీనివాస్, సైదులు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Comments

comments