Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి బైఠాయింపు

 Letter

కాటారం: ప్రేమించి మోసం చేస్తున్నాడని న్యాయం జరిగే వరకూ అతని ఇంటి ముందు దీక్ష కొనసాగిస్తానని ప్రియురాలు చేస్తున్న ప్రేమ పోరాటం గురువారం కాటారం (గారెపల్లి) మండల కేంద్రంలో జరిగింది. ప్రియుని ఇంటి ముందు బైఠా యించిన ప్రియురాలు ఐత సృజన తెలిపిన వివరాల ప్రకారం కాటారం గ్రామానికి చెందిన బొమ్మన సంతోష్‌రెడ్డి నేను గత ఎనిమిది సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నామని పెళ్లి కూడా చేసుకుందామని సంతోష్ తాను ఒక నిర్ణయానికి వచ్చామని సంతోష్‌రెడ్డి కూడా మొదట్లో పెళ్లికి ఒప్పుకున్నాడని సృజన తెలిపింది. కాగా గత నాలుగు సంవత్స రాలుగా పెళ్లికి నిరాకరించడంతో కాటారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. ఫిర్యాదు మేరకు పోలీసులు సంతోష్‌ను పిలిపించి విచారణ జరిగినట్లు తెలిపింది.

ఇదిలా ఉండగా సంతోష్‌రెడ్డి, సృజన మధ్య ప్రేమ వ్యవ హారంలో కొన్ని సమస్యలు రావడంతో నెల రోజుల పాటు ఇద్దరి మధ్య మనస్పర్ధాలు రాకుండా ఉంటే నెల రోజుల తర్వాత సృజనను పెళ్లి చేసుకుంటానని సోషల్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో అంగీకరిస్తూ సంతోషరెడ్డి పత్రం వ్రాసి ఇచ్చారు. దీనితో పాటు ఐత సృజన అనే అమ్మాయిని 8సంవత్సరాలుగా ప్రేమి స్తున్నానని జూన్ 13వ తేదీన సృజనను పెళ్ళి చేసు కుంటానని కాటారం ఎస్సైకి వ్రాసి ఇచ్చిన ఒప్పంద పత్రంతో పాటు సంతోష్‌రెడ్డి, సృజన కలిసి దిగిన ఫోటోలతో గురువారం ప్రియుని ఇంటి ముందు కూర్చుంది.

తాను పెద్ద మనుషులతో కలిసి సంతో ష్‌రెడ్డి తల్లిదండ్రులతో పెళ్ళి విషయమై మాట్లాడడం కూడా జరిగిందని దీనికి వారు నిరాకరించారని తెలిపింది. అప్పటి నుండి ఇప్పటి వరకు సంతోషను తనకు కనబడకుండా ఉంచు తున్నారని తెలిపింది. ఈ విషయమై కొన్ని రోజు లుగా పోలీస్‌స్టేషన్ చుట్టూ తిరిగినా పోలీసులు పట్టిం చుకోవడంలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. సంతోష్‌రెడ్డి తండ్రికి రాజకీయ అండ ఉండడంతో మాలాంటి పేదవారికి అన్యాయం జరుగుతుందని తెలిపింది. సంతోష్‌రెడ్డితో వివాహం జరిగి న్యాయం జరిగే వరకూ మంచినీళ్లు కూడా ముట్టుకోనని తెలిపింది.

Comments

comments