Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి దీక్ష

Lover Strike Before her Boy Friend House in Yadadri Bhongir

మనతెలంగాణ/వలిగొండ : ప్రేమించిన వ్యక్తి మోసం చేసి మరో అమ్మాయితో పెళ్ళికి సిద్ధ పడుతున్నాడనే  సమాచారంతో  ప్రియురాలు దీక్ష చేస్తున్న ఘటన మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. బాధితురాలి బంధువుల వివరాల ప్రకారం  చందుపట్లకు చెందిన పల్లపు కిష్టయ్య,కేతమ్మల కుమార్తె జ్యోతి వలిగొండ మండలానికి చెందిన రావుల భాస్కర్‌తో ప్రేమలో పడింది.

పెళ్ళి చేసుకుంటానని మాయ మాటలతో నమ్మించి తనను మోసం చేసి ఇంకొకరతో పెళ్ళి పీటలు ఎక్కడానికి సిద్దమౌతున్నట్లు బాధితురాలు తెలిపింది. పెళ్ళి చేసుకొని తనకు న్యాయం ప్రియుడి ఇంటి ముందు దీక్ష చేస్తున్నట్లు జ్యోతి విలేకర్లకు తెలిపింది. సమాచారం మేరకు దీక్ష స్థలానికి వలిగొండ ఎస్‌ఐ ఇద్రీస్ అలీ సిబ్బందితో చేరుకొని వివరాలు యువతిని వివరాలడిగారు. అనంతరం యువతి తనకు న్యాయం చేయమని,లేని పక్షంలో ఆత్మత్యాగం చేసుకుంటానని హెచ్చరించారు.  దీక్ష స్థలం వద్ద మహిళ పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేసి కేసును దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఇద్రీస్ అలీ తెలిపారు.

Comments

comments