Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

అబ్బాయి మోసపోతే చావే గతి!

ప్రియురాలు  మోసగించిందని  యువకుడి ఆత్మహత్య
మరొకరు మోసపోకుండా  తన పేరుపై చట్టం తేవాలని  సూసైడ్ నోట్

Suicide-With-Love

ఇటిక్యాల: జోగుళాం బ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం  బీచుపల్లిలో బుధవారం ప్రేమించిన అ మ్మాయి మోసం చేసిందని ఎంబిఎ చ దువుకున్న యువకుడు పురుగుల మం దు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కా గా యువకుడు రాసిన సూసైడ్ నోట్ సంచలనం సృష్టిస్తోంది. ‘మన దేశంలో ఒక అమ్మాయి మోసపోతే చట్టాలు, శి క్షలు ఉన్నాయి. కానీ ఒక అబ్బాయి మోసపోతే అవేవీ ఉండవు.

నాలా మరొ కరు మోసపోకుండా నా పేరు మీద ‘కిశోర్ చట్టం’ తీసుకురావాలని కోరు కుంటున్నాను. అమ్మాయిలను మోసం చేస్తే ప్రియుని ఇంటిముందు ధర్నాలు చేసి వారిని కలపడానికి సంఘాలన్నీ తోడవుతాయి. అదే అబ్బాయి మోసపో తే చావేగతి. అందుకే నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. మా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివించారు. వారిని మధ్యలోనే వదిలేసి వెళ్తున్నా. క్షమించా లని కోరుతున్నాను. నా చావుకు కార ణం నా ప్రియురాలే. ఆ అమ్మాయి కో ర్కెలు తీర్చడానికి ఎంతో ఖర్చు చేసుకు న్నా. కానీ నమ్మించి మోసం చేసింది.’  అంటూ  సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు. మృతుడు వీపనగండ్లకి చెందిన వాడిగా తెలిసింది.

Comments

comments