Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

చికిత్సపొందుతూ ప్రేమికుడి మృతి..

Lover dies taking poison in siddipet district

చికిత్సపొందుతూ ప్రేమికుడు మృతి
ప్రియురాలికి తీవ్ర అస్వస్థత.. సిద్దిపేట జిల్లా రేగులపల్లిలో విషాదం

సిద్దిపేట :తమ పదేళ్ల ప్రేమను ఇంట్లోవాళ్లు తిరస్కరించడంతో  ప్రేమికుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. సిద్దిపేట జిల్లా బెజ్జెంకి మండలం రేగులపల్లికి చెందిన కొట్టె సంతోష్‌ రెడ్డి (27), భువనగరి రాణి (24) అనే పది సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు. ఒకే గ్రామం కావడంతో సంతోష్‌, రాణి మధ్య కుదిరిన స్నేహం కొన్నాళ్లకే ప్రేమగా మారింది. కులాలు వేరైనా పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. వీరి ప్రేమను ఇరు కుటుంబాల వారు అంగీకరించలేదు.

రెండేళ్ల క్రితం రాణి కుటుంబ సభ్యులు ఆమె పెళ్లిని మరో వ్యక్తితో జరిపించారు. అయితే, కొన్ని నెలల తర్వాత భర్త నుంచి రాణి విడాకులు తీసుకొని తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. ఈ క్రమంలో సంతోష్‌తో మళ్లీ తన ప్రేమయాణం కొనసాగించింది. 15 రోజుల క్రితం సంతోష్‌ కుటుంబసభ్యులు మరో అమ్మాయితో నిశ్చితార్థం జరిపించి, ఈ నెల 29న పెళ్లి ముహుర్తాన్ని ఖరారు చేశారు. విషయం తెలుసుకున్న రాణి కుటుంబసభ్యులు.. సంతోష్‌రెడ్డి కుటుంబసభ్యులను నిలదీశారు. ఈ క్రమంలో విసుగుచెందిన ఇరువైపుల పెద్దలు.. ఎక్కడికైనా వెళ్లి జీవించండంటూ సంతోష్‌, రాణిలకు సూచించినట్టు తెలిసింది. దీంతో హైదరాబాద్‌ వెళ్లిపోయిన ప్రేమికులిద్దరూ తిరిగి సోమవారం అర్ధరాత్రి సిద్దిపేట కొత్త బస్టాండ్‌కు చేరుకున్నారు. బాత్‌రూంకు వెళ్లి వస్తానని వెళ్లిన  ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సంతోష్‌ మృతిచెందగా.. రాణి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

Comments

comments