Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

ప్రాణం తీసిన ఫేస్‌బుక్ ప్రేమ

మంచిర్యాల జిల్లాలో యువకుడి ఆత్మహత్య

Facebook

మంచిర్యాల : ఫేస్‌బుక్ ప్రేమ ఓ యువకుడి ప్రాణం తీసిన ఘటన మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ కాలనీలోని హిమ్మత్‌నగర్‌లో వి షాదం నింపింది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. కాలనీకి చెందిన ఆరె సాగర్ (20) న ల్గొండ జిల్లా కోదాడలో మైనింగ్ డిప్లొమా చదువు తున్నాడు. అయితే ఇటీవల సాగర్‌కు తూర్పు గో దావరి జిల్లాకు చెందిన బిఎస్‌సి నర్సింగ్ చదువు తున్న విద్యార్థిని ఫేస్‌బుక్‌లో పరిచయమైంది. కొద్దిరోజుల్లోనే వీరి పరి చయం కాస్త ప్రేమగా మారింది.

ఈ క్రమంలోనే ఇద్దరూ పెళ్లి చేసుకునేందుకు నిర్ణ యించుకున్నారు. కాగా ఈ నెల 12న సాగర్ ప్రియురాలికి ఫోన్ చేయగా ఆమె తల్లి ఫోన్ తీసి తన కుమార్తెను మరిచిపోవాలని, ఇప్పుడే పెళ్లిచేసే ఉద్దే శం లేదని తేల్చిచెప్పింది. దీంతో మనస్తాపానికి గురైన సాగర్ సోమవారం ఇం ట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలి పారు. మృతుడి తండ్రి చందర్ సింగరేణి కార్మికుడిగా పనిచేస్తున్నాడు.

Comments

comments