Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

ప్రేమజంట ఆత్మహత్యాయత్నం..!

Lovers Attempt Suicide in Guntur District

అమరావతి: ఎపిలోని గుంటూరు జిల్లా వినుకొండలో ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసింది. వినుకొండకు చెందిన షహనాజ్, కరీముల్లా గత కొంతకాలగా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. అయితే, వీరి ప్రేమ వ్యవహరం ఇంట్లోవారికి తెలిసింది. దాంతో తామిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నామని ఇంట్లోవాళ్లకు చెప్పి ఒప్పించడానికి ప్రయత్నించారు. కాగా, వీరి పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. పెళ్లి విషయంపై పెద్దల సమక్షంలో చర్చలు జరిగినా అవి విఫలం కావడంతో తీవ్ర మనస్తాపం చెందిన షహనాజ్ ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ విషయం తెలిసిన ప్రియుడు కరీముల్లా కూడా విషం తాగడంతో గమనించిన కుటుంబ సభ్యులు వారిని చికిత్స నిమిత్తం దవఖానాకు తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Comments

comments