Search
Saturday 17 November 2018
  • :
  • :

ప్రేమికుల ఆత్మహత్యాయత్నం..

Suside-image

జగ్గయ్యపేట: ప్రేమ అనేది ఎప్పుడు ఎవరి మనుసులో ఏ క్షణంలో పుడుతుందో తెలియదు. అలానే మొదలైంది.. ఈ ప్రేమ కథ.. వారిద్దరూ  వరసకి అన్నాచెల్లెలు తోడబుట్టిన వాళ్లు కాకపోయిన ఇంటిపేరు మాత్రం ఒక్కటే…. గడిచిన కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. కానీ వరుసకు అన్నాచెల్లెలు అని తెలియడంతో పెద్దలు వాళ్ల వివాహానికి ఒప్పుకోలేదు. దీంతో తీవ్రమనస్థాపానికి గురైన ఈ ప్రేమ జంట పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకున్నారు. ప్రస్తుతం చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లా పెనుగంచి ప్రోలు మండలం శివాపురంలో నివాసంముంటున్న ధరావత్‌ వెంకటేశ్వర్లు, పున్నిల కుమారుడు సాయి(19) గ్రామంలోని ఓ హోటల్‌లో చెఫ్ గా పని చేస్తున్నాడు. నల్గొండ జిల్లా దామచర్ల మండలం ఎల్‌బి తండాకు చెందిన ఓ యువతి (18)తో ప్రేమలో పడ్డాడు. తమకు పెళ్లి చేయాలంటూ, ఇద్దరూ పెద్దలకి తెలిపారు. కానీ వీరిద్దరూ వరుసకు అన్నాచెల్లెలు కావడం, ఇద్దరి ఇంటి పేర్లు ఒకటే కావటంతో పెళ్లికి కుటుంబసభ్యులు ఒప్పుకోలేదు. దీంతో సాయి, సునీత 20 రోజుల కిందట ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి పెనుగంచి ప్రోలులో మూడు రోజులుగా కలిసి ఉంటున్నారు. ఈ సంఘటనపై పెద్దల సమక్షంలో పంచాయితీ జరిగింది. దీంతో ఆమె కుటుంబసభ్యులు బలవంతంగా ఇంటికి తీసుపోయారు.  సాయి శుక్రవారం ఎల్‌బి తాండకు వెళ్లి ఆమె తిరిగి సాయి తీసుకొచ్చేశాడు. ఇద్దరూ కలిసి శనివారం పెనుగంచిప్రోలు మండలంలోని లింగగూడెం,  గౌరవరం రోడ్‌లో ఉన్న సుబాబుల్‌ తోటలోకి వెళ్లి, తమపై పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకున్నారు. రైతులు వాళ్లను గమనించి మంటలు ఆర్పి స్థానికులు సహయంతో  విజయవాడ ఆప్పత్రికి తరలించారు.

Comments

comments