Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

ప్రేమజంట ఆత్మహత్య..!

Lovers Commits Suicide in Aligarah

ఆగ్రా: పెద్దలు తమ ప్రేమను కాదన్నారనే మనస్తాపంతో ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన యుపిలోని అలీగఢ్‌లో చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళితే… అలీగఢ్‌కు చెందిన శ్యాం, మోహర్షి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. దాంతో పెళ్లి చేసుకొని ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్నారు. పెళ్లి విషయాన్ని పెద్దలకు చెప్పారు. కానీ, వారి పెళ్లికి అందరిలాగే ససేమీరా అన్నారు పెద్దలు. ప్రేమ లేదు.. పెళ్లి లేదు… మేము చెప్పినవారినే కట్టుకోవాలని ఆంక్షలు విధించారు. ఈ క్రమంలో మోహర్షికి మరో యువకుడితో మే 8న పెళ్లి ఖాయం చేశారు. తనకు వేరే యువకుడితో పెళ్లి నిశ్చయించిన విషయాన్ని మోహర్షి.. శ్యాంతో చెప్పింది. దాంతో ప్రేమికులిద్దరూ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అనంతరం ఊరి బయట ఓ చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. అయితే తన సోదరుడిని యువతి తండ్రి హత్య చేసి ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించారని ఆరోపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

comments