Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

ప్రేమజంట బలవన్మరణం..!

Lovers Commits Suicide In Wanaparthy District of Telangana

వనపర్తి: ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అప్పరాళ్ల  గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన విక్రమ్, సుస్మిత గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. అయితే, వీరి ప్రేమకు ఇరువురు కుటుంబ పెద్దలు అంగీకరించకలేదు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన సుస్మిత పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకుంది. సుస్మిత బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిన విక్రమ్ శ్రీరాంనగర్ దగ్గర రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమికులిద్దరూ బలవన్మరణానికి పాల్పడడంతో ఇరువురు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.  ఈ ఘటనతో  అప్పరాళ్ల  గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments