Home వరంగల్ రూరల్ ప్రేమజంట ఆత్మహత్య

ప్రేమజంట ఆత్మహత్య

lovers
 *మృతిచెందిన ప్రేమికులు భరత్, నజీమా

మన తెలంగాణ/నర్సంపేట/దుగ్గొండి: మతాంతర వివాహనికి పెద్దలు ఆంగీకరించలేదని ప్రేమ జంట బుథవారం వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట పట్టణంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడగా స్థానికులు గమనించి చికిత్స నిమిత్తం వరంగల్‌లోని ఎంజియంకు తరలించి చికిత్స ఆందిస్తుండగా గురువారం సాయంత్రం మరణించినట్లు కుటుంబసభ్యులు, స్థానికులు తెలిపారు. మృతుల కుటుంబసభ్యులు, స్థానికుల కథనం ప్రకారం దుగ్గొండి మండలం రేకంపేల్లి గ్రామానికి చెందిన కొగులూరి భరత్ నర్సంపేటలో ఇండియన్ స్టాఫ్ స్కిల్స్‌పేరుతో కంప్యూటర్ ఇనిస్ట్‌ట్యూట్ నిర్వహిస్తున్నాడు. ఖానపురం మండలం బుదరావుపేటకు చెందిన షెక్ నజ్మిన్ ఈసంస్థలో కోద్ది నెలలుగా ట్రేనర్‌గా చేరి పనిచేస్తుందని ,ఈ సందర్బంగా ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారిందని, ఇరువురు తమ ప్రేమవ్యవహరాన్ని పెద్దలకు తెలిపి పెండ్లి చేయాలని కోరగా నజీమా తల్లిదండ్రులు ఒప్పుకోలేదని పైగా ఆమెకు వేరే సంబంధం చూడడంతో విషయాన్ని భరత్‌కు తెలుపగా ఇద్దరు సోమవారం పురుగుల మందు వెంట తెచ్చుకుని ఇన్‌స్టూట్‌లో తాగినట్లు తెలిపారు. చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం మృతిచెందినట్లు తెలిపారు. మృతుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ బోనాల కిషన్ తెలిపారు.