Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

లవర్ కు నిప్పంటించి…. ప్రేమికుడి ఆత్మాహుతి

Lovers

తిరువనంతపురం: తన ప్రేమను తిరస్కరించిన యువతిపై యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించి, యువతిని హత్తుకున్నాడు. ఈ ఘటనలో భగ్న ప్రేమికులిద్దరు మృతి చెందారు. కేరళ రాష్ట్రం కోల్లామ్ జిల్లా నీందకరకు చెందిన ఆదర్శ్, యువతి రెండు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. యువతి తల్లిదండ్రులు ప్రేమ పెళ్లికి నిరాకరించడంతో ఆమె యువకుడిని దూరంగా పెట్టింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సప్లిమెంటరి పరీక్ష ఫలితాలు చూసుకోవడానికి ఆమె కాలేజీకి వచ్చింది. ఆ సమయంలో యువతిని బయటకు పిలిచి  పెట్రోల్ పోసి నిప్పంటించి యువతిని హత్తుకున్నాడు.  కాలిన గాయాలతో ఉన్న ఇద్దరిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో చనిపోయారు.

Comments

comments