Search
Monday 24 September 2018
  • :
  • :

సెల్ఫీ మోజు…లోయలో పడిన ప్రేమికులు

lovers
హైదరాబాద్: సెల్ఫీల మోజులో పడి నిండు ప్రాణాలు గాల్లో కలుస్తున్నా…. సెల్ఫీల పిల్చి ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా నగరంలోనూ సెల్ఫీ ప్రేమికుల పాలిట శాపంగా మారింది. సెల్ఫీ తీసుకుంటుండగా, లోయలో పడి ప్రేమికులకు తీవ్ర గాయాలయ్యాయి. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. మెహదీపట్నంకు చెందిన నాగరాజు, నిజామాబాద్‌కు చెందిన ప్రియాంక నార్సింగ్‌లోని ఓ ప్రముఖ స్టోర్‌లో పనిచేస్తున్నారు. ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. మంగళవారం ఇద్దరు కలిసి బండ్లగూడలోని కాళీమందిర్ గుడికి వెళ్లారు. గుడి సమీపంలోని ఎత్తైన కొండలపైకి ఎక్కి సెల్ఫీ తీసుకుంటుండగా అదుపుతప్పి లోయలో పడిపోయారు. వీరిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments