Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

ప్రేమికులకు కుల బహిష్కరణ

                   love

వాజేడు: ప్రేమ వివాహాన్ని చేసుకున్నారనే నెపంతో కుల బహిష్కరణ చేశారంటూ పోలీసులను ఆశ్రయించిన సంఘటన శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా వాజేడు మండలంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ కృష్ణ ప్రసాద్ వివరాల ప్రకారం.. వాజేడు మండలంలోని కొప్పుసూరు గ్రామానికి చెందిన గారపు రవి, అదే గ్రామం రజక కులానికి చెందిన శిరీష అనే యువతిని ప్రేమించాడు. నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ క్రమంలో వారికి బాబు జన్మించగా అదే గ్రామంలో నివసిస్తున్నారు. వేరే కులానికి చెందిన యువతిని వివాహాం చేసుకోవడంపై గ్రామ పెద్దలు నాలుగేళ్ల క్రితం పంచాయితీ పెట్టి కులం నుంచి బహిష్కరించారు. గ్రామంలో ఎలాంటి శుభకార్యాలకు హాజరుకాకుండా చేస్తున్నారు. తమ ఇంటికి ఎవర్ని రాకుండా ఇబ్బందులకు గురి చేస్తుండడంతో దంపతులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో ప్రేమ వివాహం చేసుకున్న వారిని ఎటువంటి ఇబ్బందులకు గురిచేయవద్దని గ్రామ పెద్దలకు కౌన్సెలింగ్ నిర్వహించి అవగాహన కల్పించామని ఎస్‌ఐ కృష్ణ ప్రసాద్ తెలిపారు.

Comments

comments