Home నిజామాబాద్ నల్లగొండ గుట్టపై ప్రేమజంట ఆత్మహత్య

నల్లగొండ గుట్టపై ప్రేమజంట ఆత్మహత్య

Lovers Sucide In Nallagonda Hills In Nizamabad Dist

కమ్మర్‌పల్లి ః గత మూడు నెలల క్రితం ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించక పోవడంతో ఇంటి నుండి వెళ్ళిన ప్రేమజంట గురువారం ఆత్మహత్య చేసుకున్నరన్న వార్త ఇరు కుటుంబాలలో దుఃఖాన్ని నింపగా హసాకొత్తూర్ గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి మండలం హసాకొత్తూర్ గ్రామానికి చెందిన గౌతమి (26), ప్రశాంత్ (21) గత కొంత కాలంగా ప్రేమించుకున్నారు. ఇద్దరి కులాలు వేరు కావడంతో పెద్దలు అంగీకరించరనే ఉద్దేశ్యంతో ఏప్రిల్ 2న ఇంటి నుండి పరారయ్యారు. ఈ విషయమై గౌతమి తండ్రి గంగాధర్ కమ్మర్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. కాగా గురువారం ఉదయం జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలం నల్లగొండ గుట్టపై గౌతమి, ప్రశాంత్‌లు ఉరేసుకొని విగతా జీవులుగా కనిపించడంతో కుటుంబీకులకు పోలీసుల ద్వారా సమాచారం అందింది. మృతదేహాలు కుళ్ళీపోయి ఉండటంతో గత 10,15 రోజుల క్రితమే వీరు ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని తెలుస్తోంది. కోడిమ్యాల పోలీసుల ద్వారా కమ్మర్‌పల్లి ఎస్సై మురళీ సమాచారం అందగా వారి కుటుంబీకులకు చేరవేయడంతో శవాల కోసం ఇరు కుటుంబాల వారు కోడిమ్యాల పోలీస్‌స్టేషన్‌కు తరలివెళ్లారు. మూడు నెలల క్రితం వెళ్లిన ప్రేమజంట పెండ్లి చేసుకొని ఎక్కడో ఉండే ఉంటారని అనుకున్న వారి కుటుంబాలకు ఆత్మహత్య చేసుకున్నారని తెలిసి విచారణలో మునిగిపోయారు.