Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

ప్రేమజంట మృతి…

 Lovers unsuspected suicide in hyderabad

Lovers unsuspected suicide in hyderabad

కేసు నమోదు చేసిన సైఫాబాద్ పోలీసులు
పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలింపు

మన తెలంగాణ/సోమాజిగూడ : అనుమానాస్పదంగా ప్రేమికుల జంట మృతి చెందిన సంఘటన సైఫాబాద్ పోలీస్టేషన్ పరిధిలో శుక్రవారం  చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఖైరతాబాద్ లోని న్యూ సీఐబీ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న బీఎస్‌ఎన్‌ఎల్ లో ఉద్యోగి కూతురు వర్షశ్రీ (22), కుమారుడు వెంకట్ సుమన్‌లు ఉన్నారు. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వర్షశ్రీ ఇంట్లోనే ఉంటూ ఆన్‌లైన్ డీటీపీ జాబ్ వర్క్ ను నిర్వహిస్తుంది. ఈ క్రమంలో తనతో పాటు కాలేజీలో చదివిన మ హేశ్వర్ రెడ్డి(25)తో ఆమెకు పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా ప్రేమగా మారింది. నిత్యం వారిరువురు ఫో న్ ద్వారా మాట్లాడుకునే వారు. ప్రస్తుతం ఇబ్రహీంపట్నంలోని రాజమహేంద్రవరం కాలేజిలో బిటెక్ రెండవ సంవత్సరం చదువుతున్న మహేశ్వర్‌రెడ్డి ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఖైరతాబాద్‌లోని వర్షశ్రీ ఇంటికి వచ్చాడు. వారిరువురు కొంత సేపు ఏదో విషయమై ఘర్షణ పడ్డారు.

రెండున్నర గంటల ప్రాంతంలో వర్షశ్రీ తన సోదరుడు వెంకట సుమన్‌కు ఫోను చేసి రోదిస్తు తన ఆవేదనను వెల్లడించింది. అనంతరం ఫోన్ స్విచ్చాఫ్ చేసింది.ఆందోళన చెందిన వెంకట సుమన్ ఇంటికి చెరుకోగానే వర్షశ్రీ అనుమానాస్పదంగా ఫ్యాన్ కొక్కానికి చున్నితో ఉరివేసుకుని వేళాడుతూ కనిపించింది. మరో బెడ్ రూమ్‌లో మహేశ్వర్‌రెడ్డి కూడా పురుగుల మందు తాగి విగతజివిగా పడి ఉన్నాడు. విషయాన్ని స్థానిక పోలీసులతో పాటు తన తండ్రి శ్రీనివాస్‌కు సమాచారం ఇచ్చాడు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, ముమ్మర దర్యాప్తు చేపట్టారు .వర్షశ్రీ మృతదేహాన్ని పరిశీలించగా కొన ఊపిరితో ఉన్నట్టు గమనించిన పోలీసులు హుటాహుటిన స్తానికంగా ఉన్న మాక్సిక్యూర్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే వర్షశ్రీ మృతిచెందినట్లు వైద్యులు ధృవికరించారు. దీంతో పోలీసులు వర్షశ్రీ ,మహేశ్వర్‌రెడ్డిల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అనుమానాస్పదమృతిగా నిర్ధారించుకొని, దర్యాప్తు చేపడుతున్నారు. త్వరలోనే మృతికి గల కారణాలు తెలుసుకుంటామని ఇన్‌స్పేక్టర్ వెంకట్ రెడ్డి తెలిపారు.

Comments

comments