Home రాష్ట్ర వార్తలు తక్కువ చార్జీ.. ఎక్కువ ప్రయాణం

తక్కువ చార్జీ.. ఎక్కువ ప్రయాణం

mmts-trainsఎంఎంటిఎస్‌కు పెరుగుతున్న ఆదరణ
మన తెలంగాణ/ హైదరాబాద్: తక్కువ చార్జీలకే ఎక్కువ దూరం రవాణా సౌకర్యం కల్పిస్తున్న ఎంఎంటిఎస్ రైళ్లకు ఆదరణ పెరుగుతోంది. ఫలక్‌నుమా – లింగంపల్లి, సికింద్రాబాద్ – హైద రాబాద్‌ల మధ్య 26 స్టేషన్లను కలుపుతూ 43 కిలో మీటర్ల మేర 121 ఎంఎంటిఎస్ సర్వీసులు నడుస్తు న్నాయి. 81 బోగీలతో కూడిన ఎలక్ట్రికల్ మల్టిఫుల్ యూనిట్ల ఎంఎంటిఎస్ రైళ్లలో ప్రతిరోజు 1,50,000 మంది ప్రయాణం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులు, ఎంఎంటిఎస్‌లో ప్రయాణిం చేందుకు వీలుగా ఒకేపాస్‌ను జారీ చేయడంతో ప్రయా ణికుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేట్ ఆపరేటర్ల ప్రయాణచార్జీలతో పోలిస్తే ఎంఎం టిఎస్ రైళ్లలో ప్రయాణం చౌకగా ఉండడమే కాకుండా పర్యావరణహితంగా ఉండడం వల్ల కూడా ప్రయాణి కులు ఎంఎంటిఎస్ రైళ్లలో ప్రయాణించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఉదాహరణకు ఫలక్‌నుమా నుంచి లింగంపల్లికి వెళ్లేందుకు బస్సులో రూ.36 అవుతుండ గా, ఎంఎంటిఎస్‌లో కేవలం రూ.10 వసూలు చేస్తున్నారు. అదే విధంగా సికింద్రాబాద్ నుంచి లింగంపల్లికి బస్సులో రూ.18, ఎంఎంటిఎస్‌లో రూ.10, సికింద్రా బాద్ నుంచి ఫలక్‌నుమాకు బస్సులో రూ.16 అవు తుండగా ఎంఎంటిఎస్‌లో కేవలం రూ.5, హైదరాబాద్ నుంచి లింగంపల్లికి బస్సులో రూ.26 ఉండగా, ఎంఎంటిఎస్‌లో రూ.10, హైదరాబాద్ నుంచి ఫలక్ నుమాకు వెళ్లేందుకు బస్సుల్లో రూ.16 వసూలు చేస్తుండగా, ఎంఎంటిఎస్‌లో రూ.10 మాత్రమే తీసుకుం టుండడంతో ప్రయాణికులు ఎంఎంటిఎస్ వైపు మొగ్గు చూపుతున్నారు.

ఎంఎంటిఎస్ రాక తర్వాత మియా పూర్, కొండా పూర్, లింగంపల్లి, చందానగర్ వంటి పట్టణ శివారు ప్రాంతాలు ఆర్థికంగా అభివృద్ధి చెందా యి. ఎంఎంటి ఎస్ సర్వీసులతో రోడ్లపై రద్దీ తగ్గి, ప్రమాదాలు కూడా తగ్గుముఖం పడుతున్నాయి. ధ్వని కాలుష్యం తగ్గింది. రోడ్లపై తిరిగే వాహనాల నుంచి హైడ్రో కార్బన్లు, నైట్రస్ ఆక్సైడ్‌లతో కూడిన పొగ విడుదలవుతుండడంతో కళ్లలో మంట, ఊపిరితిత్తులకు నష్టం వాటిల్లడమే కాకుండా శ్వాశకోశ సంబంధ వ్యాధు లు తలెత్తుతున్నాయి. నైట్రోజన్ ఆక్సైడ్ రసాయనిక వర్షాలకు కారణమవడమే కాకుండా కార్బన్ మోనా క్సైడ్ రక్త ప్రసరణకు, గుండె సంబంధిత వ్యాధు లకు కారణంగా నిలుస్తోంది. సీసం వంటి విష వాయువులు ఆరోగ్యాన్ని అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లోకి నెడు తున్నాయి. నిత్యం ఎంఎంటిఎస్ సర్వీసులను 1,50,000 మంది వినియోగించు కుంటుండగా, ఎంఎంటిఎస్ లేని పక్షంలో మొత్తం కార్బన్ డయాక్సైడ్ ప్రతి సంవత్సరానికి 741 టన్నులుగా ఉండేదని రైల్వే ఒక అంచనా వేసింది. ఎంఎంటిఎస్ ఫేజ్ -2 సేవలు ప్రారంభమైతే ప్రజలకు మరింత ప్రయోజనం చేకూ రడమే కాకుండా పర్యావరణానికి మేలు కలుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.