Home జిల్లాలు లయోలకాలనీలో కరెంటు కష్టాలు

లయోలకాలనీలో కరెంటు కష్టాలు

current-problemఅస్తవ్యస్తంగా విద్యుత్ తీగలు, స్తంభాలు
హై,లో ఓల్టేజీలతో కాలనీవాసుల ఆందోళన
అధికారుల నిర్లక్షంతో కాలిపోతున్న ట్రాన్స్‌ఫర్మర్లు
ఖర్చులు భరిస్తేనే కొత్తవి బిగిస్తామంటున్న అధికారులు

 హన్మకొండటౌన్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ పరి ధిలోని 58వ డివిజన్‌లో గల లయోలకాలనీ ప్రజలకు రోజురోజుకు కరెంటు కష్టాలు తీవ్రం అవుతున్నాయి. కాలనీలో విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగలు అస్త వ్యస్థంగా ఉండడంతో చిన్న గాలి వచ్చిన విద్యుత్ వైర్లు ఒకదానికి ఒకటి తాకి మంటలు లేస్తున్నాయి. అంతేకాకుండా విద్యుత్ స్తంభాలు సైతం ఎప్పుడు నేలకు ఒరుగుతాయోనని కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా నిత్యం హై, లో ఓల్టేజీలతో విద్యుత్ సరఫరా కావడంతో ఇంట్లోని టివిలు, రిఫ్రీజి రెటర్లు, ఫ్యాన్స్, మోటర్లు కాలిపోతున్నాయని వాపోతున్నారు. దీనితో రెక్కాడితే గాని డొక్కాడని దినసరి కూలిపై జీవనం సాగిస్తున్న కాలనీ ప్రజలకు తమ ఎల క్ట్రికల్ వస్తువులు కాలిపోవడంతో ఆర్థికంగా చితికిపోతున్నామని ఆందోళన చెం దుతున్నారు. కాలనీలో విద్యుత్ స్తంభాలకు బిగించిన కాసారాలు, జంపర్లు పూర్తి గా కాలిపోయాని, కరెంటు తీగలు జోలపడి ఉండడం వలన, విద్యుత్ సరఫరా అవుతున్న వైర్లు టివి కేబుల్ వైర్‌కు, తగులుతున్నాయి. అంతే కాకుండా విద్యుత్ స్తంభాలకు విచ్చల విడిగా కనెక్షన్స్ ఇవ్వడంతో నిత్యం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పాడుతుందని కాలనీవాసులు తెలుపుతున్నారు.
అధికారుల నిర్లక్షంతో కాలిపోతున్న ట్రాన్స్‌ఫార్మర్లు
లయోలకాలనీలో గతంతో ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ఫార్మర్ కెఫాసిటి తక్కువగా ఉండడంతో నిత్యం కాలిపోతుండేదని, తిరిగి మరమ్మత్తులు చేసే వరకు రోజుల తరబడి చీకట్లోనే మగ్గేవారిమని కాలనీ ప్రజలు తెలిపారు. సంవత్సరం క్రితం కాలనీలో మెరుగైన విద్యుత్ సరఫరా చేయడానికి, ఇంటి అవసరాలకు సరిపడే విధంగా 63 కెఫాసిటి గల కొత్త ట్రాన్స్‌ఫార్మర్ తీసుకువచ్చి ట్రాన్స్‌ఫార్మర్ గద్దె కట్టుకుంటేనే ట్రాన్స్‌ఫార్మర్ బిగిస్తామని అధికారులు సుమారు 6 నెలలకు పైగా బిగించకుండా వదిలివేశారు. చివరికి కాలనీ వాసులు ఇంటింటికి చెందాలు వేసుకుని ట్రాన్స్‌ఫార్మర్ గద్దెను స్వయంగా నిర్మించారు. కాలనీవాసులు నిర్మించి న గద్దెపై ట్రాన్స్‌ఫార్మర్‌ను బిగించారు. ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ఏర్పాటు చేసిన హెర్త్ వైరుకు సరిగా కనెక్షన్ ఇవ్వకుండా అధికారులు నిర్లక్షం చేయడంతో గత పది రోజుల క్రితం ఒక పంది హెర్త్‌వైర్‌కు తగిలి చనిపోయింది. అప్పటి నుండి కాలనీలో విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. హై, లో ఓల్టేజీలతో విద్యుత్ సరఫరా కావడంతో ఇంట్లోని ఎలక్ట్రికల్ పరికరాలు కాలిపోతున్నాయని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 10 రోజుల నుండి హై, లో, ఓల్టెజీలతో విద్యుత్ సరఫర కావడం వలన అనేక ఇబ్బందులు పడుతున్నామని సంబందిం చిన ఎఇకి ఫిర్యాదులు చేస్తే పట్టించుకోకపోగా, మరో ట్రాన్స్‌ఫార్మర్ బిగించాల ని, జేసిబి, ట్రాన్స్‌ఫార్మర్, ట్రాన్స్‌ఫోర్ట్ చార్జీలు, హెర్త్‌వైర్ రంద్రం తవ్వించడా నికి, తదితర లేబర్ ఖర్చులన్ని భరిస్తేనే మరో ట్రాన్స్‌ఫర్మర్ బిగిస్తామని విద్యుత్ ఎఇ తెగేసి చెప్పారని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. బిల్లులు చెల్లిస్తున్నాము కదా? మెరుగైన విద్యుత్ సరఫరా చేయడం మీబాధ్యత కదా? అని కాలనీ వాసులు ప్రశ్నిస్తే, అయితే మాకు వీలుపడినప్పుడు ట్రాన్స్‌ఫర్మర్ బిగిస్తామని అప్పడి వరకు మీకు దిక్కున్న చోట చెప్పుకొమ్మని సదరు ఎఇ సమాధానం చెప్పాడని కాలనీ ప్రజలు తెలిపారు.
రూ.40వేల ఖర్చులు భరించిన శూన్యం
కాలనీలో నూతన ట్రాన్స్‌ఫర్మర్ ఏర్పాటు చేయడానికి గద్దె కట్టుకోవాలని, లేకుం టే ట్రాన్స్‌ఫర్మర్ బిగించమని ఆరు నెలలుగా బిగించకుండా కాలనీలో తెచ్చిన ట్రాన్స్‌ఫర్మర్‌ను కలెక్షన్ ఇవ్వకుండా వదిలివేయడంతో ఇంటింటికి చెందాలు వేసుకుని ట్రాన్స్‌ఫర్మర్ గద్దెను నిర్మించుకున్నామని, ట్రాన్స్‌ఫర్మర్ బిగించడానికి సుమారు రూ.30 వరకు తామే ఖర్చులన్ని భరించామని కాలనీవాసులు తెలి పారు. ఆ ట్రాన్స్‌ఫర్మర్‌కు హెర్త్‌వైర్‌కు సరిగా కనెక్షన్ ఇవ్వకపోవడంతో గత పది రోజుల క్రితం కాలిపోయిందని, మరో ట్రాన్స్‌ఫర్మర్ బిగించాలంటే ఖర్చులు భరించాలని ఏఈ చెప్పడంతో మరల ఇంటింటికి చెందాలు వేసుకుని సుమారు రూ.10 వేల వరకు ఖర్చులు పెట్టుకున్నామని అయినప్పటికిని మెరుగైన విద్యుత్ సరఫరా కావడం లేదని, ఎఇ పూర్తి స్థాయిలో పర్యవేక్షించకుండా, నిర్లక్షం చేయడం వలననే అటు విద్యుత్ సంస్థకు, ఇటు కాలనీ ప్రజలు తీవ్ర నష్టం జరు గుతుందని, విధుల పట్ల నిర్లక్షం చేస్తున్న ఎఇపై తగిన చర్యలు తీసుకోవాలని కాలనీవాసలు డిమాండ్ చేస్తున్నారు.
ఎఇ నిర్లక్షంతోనే కరెంటు కష్టాలు: ఎం.డి. రఫీక్‌పాషా – లయోలకాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు
విద్యుత్ శాఖ అసిస్టేంట్ ఇంజనీర్ నిర్లక్షంగా వ్యవహరిం చడం మూలంగానే లయోలకాలనీలో కరెంటు కష్టాలు రోజురోజుకు ఎక్కువగా అవుతున్నాయి. గతంలో కాలనీ లో ఉన్న విద్యుత్ కనెక్షన్లకు సరిపడే విధంగా 63 కే.వి. ట్రాన్స్ ఫర్మర్‌ను కాలనీకి తీసుకువచ్చారు. కాని ఆరు నెలలుగా బిగించకుండా రోడ్డుపై నిరూపయోగంగా పడేశా రు. చివరికి కాలనీవాసులందరం చందాలు వేసుకుని గద్దె కట్టడంతో బిగించారు. కాని ట్రాన్స్‌పర్మర్‌కు కనెక్షన్ ఇచ్చే హర్త్‌వైర్‌ను సరిగా ఇవ్వకపోవడంతో ఆట్రాన్స్‌ఫర్మర్ కాలిపోయింది. మరో ట్రాన్స్‌ఫర్మర్ బిగించా లంటే ఖర్చులు భరించాలని, లేకుంటే బిగించలేమని ఏఈ తెగేసి చెప్పడంతో మరల చందాలు వేసుకుని ఖర్చులు భరిస్తేనే మరొక ట్రాన్స్‌ఫర్మర్ బిగించారు. అయినప్పటికిని విద్యుత్ సమస్యల పరిష్కారం కాలేదు. ఇప్పటి వరకు ఎఇ ఈ సమస్యల పట్ల ఫోన్‌లో తప్పా క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించలేదు. విధుల పట్ల నిర్లక్షం వహిస్తున్న ఎఇపై వెంటనే చర్యలు తీసుకోవాలి
కరెంటు సరిగ్గరాక నష్టపోతున్నాం: నాళిక సమ్మయ్య – కాలనీవాసి
మాకాలనీకి సరిగ్గా కరెంటు రావడం లేదు. మద్య మద్యల కరెంటుపోయి, ఎక్కువ, తక్కువలు రావడంతో ఇండ్లల్లో టివీలు, ప్యాన్లు, కాలిపోతున్నాయి. కరెంటోళ్లకు చెప్పిన పట్టించుకోలేదు. ఇప్పటికే కాలనీవాసులంతా కలిసి పైస లేసుకుని కరోంటోళ్లకు కడితే కూడ సరిగా కరెంటు వస్తలేదు. అసలే ఎండకాలం ఉక్కపోత, దోమలతో అనేక ఇబ్బందులు పడుతున్నాము. ఇప్పటికైన పై అధికా రులు స్పందించి వెంటనే మాసమస్యలను పరిష్కరించాలి
ట్రాన్స్‌ఫర్మర్ బిగించాలంటే ఖర్చులు భరించాలి: ఎఇ జవహర్‌నాయక్
ట్రాన్స్‌ఫర్మర్ బిగించాలంటే దానికయ్యే ఖర్చులు భరించాలి. ప్రజలు బిల్లులు కడుతున్నప్పుడు మీరే ట్రాన్స్‌ఫర్మర్ బిగించాలి కదా? అని అడిగితే…కనీస ఫార్మలిటిస్ ఉంటాయి అవి భరిస్తేనే బిగిస్తం. లేదంటే ఎవరికైన చెప్పుకోండి.