Home తాజా వార్తలు రూ.9 వేల కోట్ల బైబ్యాక్

రూ.9 వేల కోట్ల బైబ్యాక్

 L&T announces Rs 9,000-crore share buyback

ఎల్ అండ్ టి కంపెనీ బోర్డు ఆమోదం

న్యూఢిల్లీ: ఇంజనీరింగ్, టెక్నాలజీ సంస్థ ఎల్ అండ్ టి(లార్సెన్ అండ్ టూబ్రో) బోర్డు డైరెక్టర్లు 6 కోట్ల ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌కు ఆమోదం తెలిపారు. రూ. 1,500 చొప్పున దాదాపు 4.29 శాతం ఈక్విటీ షేర్ క్యాపిటల్‌ను సొంతం చేసుకునేం దుకు ప్రయత్నిస్తోంది. మొత్తం బై బ్యాక్ కోసం రూ.9000 కోట్లు వెచ్చిస్తోంది. మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (బైబ్యాక్ ఆఫ్ సెక్యూరిటీస్) నిబంధనల ప్రకారం వాటా ల కొనుగోలుకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. రూ. 9వేలకోట్ల షేర్లను బై బ్యాక్‌ను టెండర్ ఆఫర్ ద్వా రా చేపట్టనున్నట్లు కంపె నీ తెలియజేసింది. వాటాదారు లు కంపెనీ పట్ల చూపిన  ప్రేమను తిరిగి ఇవ్వాలను కుంటున్నామని ఎల్ అండ్ టి ఛైర్మన్ ఎఎం నాయక్ చెప్పారు. ఒక్కో  ఈక్విటీ షేరు విలువు 1500 రూపాయల వద్ద 6 కోట్ల షేర్లు కొనుగోలు చేయనున్నామని వెల్లడించారు. గురు వారం స్టాక్ మార్కెట్ లో ఎల్ అండ్ టి షేరు ధర 2.07 శాతం పెరిగి రూ.1,349 వద్ద స్థిరపడింది.